PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news42bb6e15-5e6f-4abf-af92-de856150c63b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news42bb6e15-5e6f-4abf-af92-de856150c63b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని రాజకీయ పరిణామాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్ లో జరిగుతున్న ఎన్నికల కారణంగా ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మమత బెనర్జీకి తిరుగేలేని బంగాల్ లో బీజేపీ బలపడడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు మమత పై తిరుగుబాటు కోరుకుంటున్నారని, అందువల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తృణముల్ పార్టీ నేతలు కూడా తమదే గెలుపంటూ latest news;modi;mamata benerjee;tiru;bharatiya janata party;india;bangladesh;west bengal - kolkata;congress;bank;survey;cheque;letter;partyబెంగాల్ లో బీజేపీ గెలుపు పై ధీమా..కారణం ఆదేనా..?బెంగాల్ లో బీజేపీ గెలుపు పై ధీమా..కారణం ఆదేనా..?latest news;modi;mamata benerjee;tiru;bharatiya janata party;india;bangladesh;west bengal - kolkata;congress;bank;survey;cheque;letter;partyThu, 15 Apr 2021 09:14:29 GMT ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని రాజకీయ పరిణామాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్ లో జరిగుతున్న ఎన్నికల కారణంగా ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మమత బెనర్జీకి తిరుగేలేని బంగాల్ లో బీజేపీ బలపడడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు మమత పై తిరుగుబాటు కోరుకుంటున్నారని, అందువల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తృణముల్ పార్టీ నేతలు కూడా తమదే గెలుపంటూ బీజేపీ కి వంద సీట్లు కూడా దాటవని సవాల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సర్వే సంస్థల ప్రకారం బీజేపీ కే విజయావకాశాలు ఉన్నాయని రిపోర్ట్స్ రావడంతో దీదీ కి చెక్ పడడం ఖాయం అని భావించారంతా. అయితే అనూహ్యంగా సర్వేల తీరు మరి మళ్ళీ మమత కే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్స్ రావడంతో  పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే బీజేపీ పార్టీ విజయంపై ఎంతుకంత గట్టి నమ్మకంతో ఉంది అనే దానిపై ఆ పార్టీ కి సంబంధించిన చాడా శాస్త్రి తనదైన వాదనను వినిపిస్తున్నారు. " దేశ విభజన సమయంలోను, బంగ్లాదేశ్ విమోచన సమయంలోనూ నష్ట పోయిన వారిలో ధళితులు అధికం. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఇల్లు, భూములను కోల్పోయి పొట్ట కూటి కోసం భారత్ వచ్చి బెంగాల్, అసోం, బిహార్ వంటి మొదలగు రాష్ట్రాలలో స్థిరపడ్డారు.

అయితే ఇలా వలస వచ్చిన దళితులపై ప్రభుత్వాలు మొదటి నుండి కూడా చిన్న చూపు చూస్తున్నాయి. వలస వచ్చిన దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. దళిత అంశాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన సిపిఎం కూడా వలస వచ్చిన దళితులకు చేసిందేమి లేదు. ఇక మమత అధికారం చేపట్టిన తరువాత వలస వచ్చిన దళితుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో దేశాన్ని అభివృద్ది పథంలో నడుపిస్తున్న మోడీ వైపు దళిత ప్రజలు చూస్తున్నారు. బెంగాల్ లో 27 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వలస దళితులు తమ హిందూ గుర్తింపు తత్వాన్ని గ్రామాల్లో విస్తరింప జేస్తూ..బిజీపీ ని బలపరుస్తున్నారు. అందువల్లే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడిందని చాడా శాస్త్రీ చెబుతున్నారు.. కాగా మమత నిరంకుశ పాలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అందువల్లే ప్రజలు బీజేపీ కి పట్టం కట్టబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మరి   వీరి అంచనా నిజమవుతుందా..లేక మళ్ళీ మమతనే అధికారం చేపడతారా అనేది ఆసక్తికరంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌... ఎందుకంటే..‌?

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>