PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/maharashtra-cm-order-officials-for-a-complete-lockdown-as-cases-cross-per-day979d4ffc-937a-48a5-a21e-c33eb8403df7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/maharashtra-cm-order-officials-for-a-complete-lockdown-as-cases-cross-per-day979d4ffc-937a-48a5-a21e-c33eb8403df7-415x250-IndiaHerald.jpgకరోనా విజృంభణకు మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. నిత్యం కొత్తగా అక్కడ 60వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. దేశం మొత్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో ఇక్క‌డి నుంచే 50శాతం ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌ర‌ణాల సంఖ్య కూడా దాదాపు అంతేశాతంగా ఉంది. అక్కడ వైరస్‌ ఉద్ధృతికి ‘డబుల్‌ మ్యుటేషన్‌’ కారణమనే అనుమానాలు నెల‌కొంటున్నాయి. 61శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. భార‌త్‌లో వైరస్‌ ప్రవర్తనను, ప‌రివ‌ర్త‌న‌ను అంచనా వేసేందుకు రోగుల నుంచి నమూనాలను చేప‌డుతున్corona;nithya new;maharashtra - mumbai;january;capital;maharashtra;central government;marchటీకాకు లొంగ‌ని వైర‌స్‌... మ‌హారాష్ట్ర‌లో కొత్త మ్యుటేష‌న్లు...టీకాకు లొంగ‌ని వైర‌స్‌... మ‌హారాష్ట్ర‌లో కొత్త మ్యుటేష‌న్లు...corona;nithya new;maharashtra - mumbai;january;capital;maharashtra;central government;marchThu, 15 Apr 2021 10:08:35 GMTకరోనా విజృంభణకు మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. నిత్యం కొత్తగా అక్కడ 60వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. దేశం మొత్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో ఇక్క‌డి నుంచే 50శాతం ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌ర‌ణాల సంఖ్య కూడా దాదాపు అంతేశాతంగా ఉంది. అక్కడ వైరస్‌ ఉద్ధృతికి ‘డబుల్‌ మ్యుటేషన్‌’ కారణమనే అనుమానాలు నెల‌కొంటున్నాయి. 61శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. భార‌త్‌లో వైరస్‌ ప్రవర్తనను, ప‌రివ‌ర్త‌న‌ను అంచనా వేసేందుకు రోగుల నుంచి నమూనాలను చేప‌డుతున్నారు. మహారాష్ట్రలో జనవరి-మార్చి మధ్య కాలంలో 361 కరోనా శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో విశ్లేషించారు.


వాటిలో 61శాతం కేసుల్లో డబుల్‌ మ్యుటేషన్లు బయటపడినట్లు నిపుణులు గుర్తించారు. అయితే  రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతికి డబుల్‌ మ్యుటేషన్‌ కారమణమని ఈ ఫలితాల ద్వారా పేర్కొనలేమని, అలా అని కాద‌ని కూడా చెప్ప‌లేమ‌ని  స్పష్టం చేస్తున్నారు. టీకా  వేయించుకున్న వారు కూడా పెద్ద సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో దాని ప్ర‌భావంపైనా అనుమానాలు నెల‌కొంటున్నాయి.   తాజాగా దేశంలో కరోనా విజృంభణ తారా స్థాయికి చేరుకుంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారిగా పాజిటివ్ కేసులు 2లక్షల మార్క్ క్రాస్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,00,739 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో మరో 1,038 మంది మృతి చెందారు.


దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,40,74,564 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా నుంచి 1,24,29,564 మంది కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,73,123 కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది కరోనా మహమ్మారి. ఒక్కరోజులోనే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇవే అత్యధిక కేసులు. ఇక మహారాష్ట్రలో ఐతే 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పైగా అక్కడ ఆందోళన కలిగించే మరో అంశం. డబుల్‌ మ్యుటేషన్‌. ఈ డబుల్ మ్యుటేషన్‌తోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతోందా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>