PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsb0a0af0d-e8a0-48bf-afa7-a3def0baac83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsb0a0af0d-e8a0-48bf-afa7-a3def0baac83-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఇక్క‌డ స్నానానికి దేశం న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు హాజ‌ర‌వుతుండ‌టంతో అంతేస్థాయిలో..అదే విధంగా క‌రోనా వివిధ ప్రాంతాల‌కు పాకుతోంది. ఇక్క‌డికి వ‌స్తున్న భ‌క్తులు క‌రోనా వాహ‌కాలుగా మారుతున్నారు. లక్షలాది మంది యాత్రికులు ఇక్కడ పుణ్యస్నానాల కోసం హాజరవుతుండగా, వారిలో పలువురు కరోనా బారిన పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నామమాత్రంగా జరుగుతున్నాయి. పరిమిత పరీక్షల్లోనే పలువురికి కరోనా సోకినట్లు తేలుతుండటం ఆందోళన కలిగిస్తharidwaar;hardwar;local language;central governmentహ‌రిద్వార్ నుంచి క‌రోనా స్ప్రెడ్‌....దేశ వ్యాప్తంగా కుంభ‌మేళా లింకులుహ‌రిద్వార్ నుంచి క‌రోనా స్ప్రెడ్‌....దేశ వ్యాప్తంగా కుంభ‌మేళా లింకులుharidwaar;hardwar;local language;central governmentThu, 15 Apr 2021 08:49:33 GMTఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఇక్క‌డ స్నానానికి దేశం న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు హాజ‌ర‌వుతుండ‌టంతో అంతేస్థాయిలో..అదే విధంగా క‌రోనా వివిధ ప్రాంతాల‌కు పాకుతోంది. ఇక్క‌డికి వ‌స్తున్న భ‌క్తులు క‌రోనా వాహ‌కాలుగా మారుతున్నారు. లక్షలాది మంది యాత్రికులు ఇక్కడ పుణ్యస్నానాల కోసం హాజరవుతుండగా, వారిలో పలువురు కరోనా బారిన పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నామమాత్రంగా జరుగుతున్నాయి. పరిమిత పరీక్షల్లోనే పలువురికి కరోనా సోకినట్లు తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక అధికారయంత్రాంగం తెలిపిన సమాచారం ప్రకారం గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 1500మందికి ఇక్కడ కరోనా సోకింది.


సోమవారం 408 కేసులు నమోదుకాగా, మంగళవారం 594 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కూడా దాదాపుగా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. కరోనా నిబంధనలను యాత్రికులు దాదాపుగా పట్టించుకోవడంలేదు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం నామమాత్రంగా మారింది. భౌతికదూరం పాటించడం ఇటువంటి చోట్ల అసాధ్యమన్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలు కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు.  హరిద్వార్‌లోని రైల్వే స్టేషన్ నుంచి దిగ్గజ హర్ కి పౌరి ఘాట్ల వరకు థర్మల్ స్క్రీనింగ్ కోసం ఎక్కడా ఏర్పాట్లు లేవు. వాటిని ట్రాక్ చేయడానికి కొత్త AI- ప్రారంభించబడిన సీసీటీవి వ్యవస్థ ఉన్నప్పటికీ మాస్కులు ధరించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.


హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది.  ప్రపంచంలోనే  అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి.  ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు.  నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు.  కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు.  అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది.  ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు.  బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>