Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-videob254a3b7-678d-4de7-8643-feb91636455b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-videob254a3b7-678d-4de7-8643-feb91636455b-415x250-IndiaHerald.jpg ‘నాన్నా.. పందులే గుంపులు గుంపులుగా వస్తాయ్.. సింహం, సింగిల్‌గా వస్తుంది’ ఈ డైలాగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో విలన్ డెన్‌లో అడుగుపెట్టిన రజినీ కాంత్ ఈ డైలాగ్ చెప్తాడు. అయితే అది సినిమా కాబట్టి హీరో విలన్ మనుషులందరినీ చితక్కొట్టి తన హీరోయిజం చూపిస్తాడు. కానీ నిజజీవితంలో అలా జరగదు. అది సింహమైనా సరే.. ఒంటిరిగా వెళితో చావే గతి. దానికి ఉదాహరణే ఈ వీడియో. వేట కోసం గేదెల గుంపుపై..viral video;manu;simhaa;cinema;rajani kanth;twitter;lion;hero;chatrapathi shivaji;sivaji;panjaaసింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోసింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోviral video;manu;simhaa;cinema;rajani kanth;twitter;lion;hero;chatrapathi shivaji;sivaji;panjaaThu, 15 Apr 2021 15:40:48 GMTఇంటర్నెట్ డెస్క్: ‘నాన్నా.. పందులే గుంపులు గుంపులుగా వస్తాయ్.. సింహం, సింగిల్‌గా వస్తుంది’ ఈ డైలాగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో విలన్ డెన్‌లో అడుగుపెట్టిన రజినీ కాంత్ ఈ డైలాగ్ చెప్తాడు. అయితే అది సినిమా కాబట్టి హీరో విలన్ మనుషులందరినీ చితక్కొట్టి తన హీరోయిజం చూపిస్తాడు. కానీ నిజజీవితంలో అలా జరగదు. అది సింహమైనా సరే.. ఒంటిరిగా వెళితో చావే గతి. దానికి ఉదాహరణే ఈ వీడియో. వేట కోసం గేదెల గుంపుపై దాడి చేసిన సింహాన్ని ఆ గెదెల గుంపంతా కలిసి ఫుట్‌బాల్ ఆడేసింది. వందకు పైగా ఉన్న గేదెలు తమ కొమ్ములతో సింహాన్ని చీల్చి చెండాడేశాయి. అత్యంత దారుణమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహం పంజా పడిదంటే ఏ జంతువైనా మట్టి కరవాల్సిందే. సింహం గర్జన వినిపిస్తేనే జంతువలన్నీ వణకిపోతాయి. పిక్కబలం చూపించి పారిపోతాయి. కానీ ఓ సింహంపై దాడి చేసి క్రూరంగా వేరే జంతువులు చంపిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..?  లేకపోతే ఇప్పుడు చూడండి. ఓ గేదెల మందపై దాడి చేసిన సింహాన్ని ఆ మందలోని గేదెలన్నీ కలిసి చంపేశాయి. సింహం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి కొన్ని గేదెలు తిరిగి దానిని చనిపోయేవరకు కుమ్మి చంపేశాయి.

నది ఒడ్డున పెద్ద సంఖ్యలో గేదెలు ఉండగా.. అదే సమయంలో ఎలా వచ్చిందో ఓ సింహం వాటి మధ్యలోకొచ్చి ఇరుక్కుపోయింది. ఇక అంతే ఆ గేదెలన్నీ కలిసి సింహాన్ని తమ కొమ్ములతో గాలిలో ఎగరేసి చీల్చి పారేశాయి. గేదెల కొమ్ముల దెబ్బకు సింహం కడుపు భాగం చీలిపోయింది.  కసితీరా ఆ సింహాన్ని చంపేసిన గేదెలు దాని పక్కనే తిరగడాన్ని వీడియోలో గమనించవచ్చు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ఖాతాతో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఐకమత్యంగా ఉండబట్టే ఆ గేదెలకు అంత స్టామినా వచ్చిందని, అందుకే అంతా కలిసి ఉండాలని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం తెలివి లేని సింహం.. ఎంత రాజైతే మాత్రం గుడ్డిగా దాడి చేస్తే ఇలానే జరుగుతుంది అంటూ రాసుకొస్తున్నారు.

" style="height: 370px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>