MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/summer-holidays-tollywood-telugu-film-industry25f16b9e-aa50-4515-9746-3137fdc4ead2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/summer-holidays-tollywood-telugu-film-industry25f16b9e-aa50-4515-9746-3137fdc4ead2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సహజంగా సమ్మర్ హాలిడేస్ పైనే టాలీవుడ్ గంపెడాశలు పెట్టుకుని ఉంటుంది. అందరికీ అవి హాలిడేస్ అయితే, సినిమా వాళ్లకి మాత్రం కలెక్షన్లు తెచ్చిపెట్టే వర్కింగ్ డేస్. సంక్రాంతి సీజన్ అయినా, దసరా సీజన్ అయినా కొన్ని రోజులు మాత్రమే జనాలు ఖాళీగా ఉంటారు. సమ్మర్ అంటే దాదాపు రెండు నెలలు సెలవలు ఉంటాయి. కోచింగ్ లకు వచ్చే కుర్రకారు కూడా ఏదో ఒక టైమ్ లో సినిమా చూడటానికి థియేటర్లో ఎంట్రీ ఇస్తారు. అందుకే సమ్మర్ సీజన్ లో మంచి టైమ్ చూసుకుని సినిమా విడుదల చేస్తే సేఫ్ గేమ్ ఆడినట్టే. అయితsummer holidays, tollywood, telugu film industry;nani;kranthi;kranti;dussehra;makar sakranti;geum;tollywood;cinema;sankranthi;2020;love;film industry;industry;vijayadashami;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyటాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..summer holidays, tollywood, telugu film industry;nani;kranthi;kranti;dussehra;makar sakranti;geum;tollywood;cinema;sankranthi;2020;love;film industry;industry;vijayadashami;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyThu, 15 Apr 2021 11:00:00 GMTటాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సహజంగా సమ్మర్ హాలిడేస్ పైనే టాలీవుడ్ గంపెడాశలు పెట్టుకుని ఉంటుంది. అందరికీ అవి హాలిడేస్ అయితే, సినిమా వాళ్లకి మాత్రం కలెక్షన్లు తెచ్చిపెట్టే వర్కింగ్ డేస్. సంక్రాంతి సీజన్ అయినా, దసరా సీజన్ అయినా కొన్ని రోజులు మాత్రమే జనాలు ఖాళీగా ఉంటారు. సమ్మర్ అంటే దాదాపు రెండు నెలలు సెలవలు ఉంటాయి. కోచింగ్ లకు వచ్చే కుర్రకారు కూడా ఏదో ఒక టైమ్ లో సినిమా చూడటానికి థియేటర్లో ఎంట్రీ ఇస్తారు. అందుకే సమ్మర్ సీజన్ లో మంచి టైమ్ చూసుకుని సినిమా విడుదల చేస్తే సేఫ్ గేమ్ ఆడినట్టే. అయితే ఈ ఏడాది కూడా టాలీవుడ్ కి సమ్మర్ నిరాశ మిగిల్చేలా ఉంది.

గతేడాది సమ్మర్ సీజన్ అన్ని వర్గాలకు నష్టాల్ని మిగిల్చింది. కూల్ డ్రింక్స్ దగ్గర్నుంచి, సినిమా ఇండస్ట్రీ వరకు సమ్మర్ ని నమ్ముకున్నవారంతా నట్టేట మునిగారు. ఈ సారి కూడా సమ్మర్ సీజన్ తెలుగు సినీ ఇండస్ట్రీ సహా అన్ని చోట్లా సినీ వర్గాలను నిండా ముంచుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన ఈ దశలో దాదాపుగా వకీల్ సాబ్ తోటే.. పెద్ద సినిమాలు ఆగిపోతాయని చెప్పాకోవాలి.

కరోనా పుణ్యమా అని టాలీవుడ్ కు వరుసగా రెండో సమ్మర్ కూడా ఎగిరిపోయింది. 2020 సమ్మర్ పూర్తిగా హాలిడేస్ తో సరిపోగా.. 2021 సమ్మర్ మీద హోప్ పెట్టుకుంటే అది కూడా పూర్తిగా నిరాశ పరిచేలా కనిపిస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వకీల్ సాబ్ తో పెద్ద సినిమాల జాతర మొదలు కావాల్సి ఉంది. అయితే ఆ జాతర వకీల్ సాబ్ తోటే ఆగిపోయేలా కనిపిస్తోంది. వకీల్ సాబ్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే సరికి విడుదల కావాల్సిన సినిమా నిర్మాతల్లో కూడా ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో.. కలెక్షన్లపై ప్రభావం పడింది. దీంతో మిగతా నిర్మాతలు అలెర్ట్ అయ్యారు, సినిమాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈనెల 16న రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడింది. 23న రావాల్సిన నాని 'టక్ జగదీష్' కూడా అంతే. పాగల్, విరాట పర్వం కూడా వెనక్కి తగ్గాయి. ఆచార్, పుష్ప, అఖండ.. ఇలా అన్ని సినిమాలూ వెనకడుగు వేసినట్టే. అంటే సమ్మర్ సీజనే కాదు, ఆ తర్వాత కూడా ఆచుతూచి సినిమాలు విడుదల చేస్తారనమాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ పవన్ కి హగ్ ఇచ్చాడా... మరి అలా ఎందుకు చేయలేదు ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>