PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-bjp-pawankalyanb2a01a33-76fe-4003-8d98-6524e33453ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-bjp-pawankalyanb2a01a33-76fe-4003-8d98-6524e33453ed-415x250-IndiaHerald.jpgనేతి బీర‌కాయ‌లో మీరెప్పుడైనా నెయ్యిని చూశారా? క‌నీసం మైసూర్ బోండాలో మైసూర్‌నైనా చూశారా? చూసివుండ‌రు. ఎందుకంటే అవి ఉండ‌వుకాబ‌ట్టి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స్నేహం కూడా ఇదే ప‌రిస్థితిలో ఉంది. పేరుకే పొత్తు త‌ప్ప ఎక్క‌డా క‌లిసి ముందుకు సాగుతున్న ప‌రిస్థితి కాగ‌డా పెట్టి వెతికినా క‌న‌ప‌డ‌టంలేదు. తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.ycp, jagan, bjp, pawankalyan;tiru;bharatiya janata party;media;marriage;allu sneha;partyనేతి బీర‌కాయ‌లో మీరెప్పుడైనా నెయ్యిని చూశారా??నేతి బీర‌కాయ‌లో మీరెప్పుడైనా నెయ్యిని చూశారా??ycp, jagan, bjp, pawankalyan;tiru;bharatiya janata party;media;marriage;allu sneha;partyThu, 15 Apr 2021 11:52:59 GMT
నేతి బీర‌కాయ‌లో మీరెప్పుడైనా నెయ్యిని చూశారా?  క‌నీసం మైసూర్ బోండాలో మైసూర్‌నైనా చూశారా?  చూసివుండ‌రు. ఎందుకంటే అవి ఉండ‌వుకాబ‌ట్టి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స్నేహం కూడా ఇదే ప‌రిస్థితిలో ఉంది. పేరుకే పొత్తు త‌ప్ప ఎక్క‌డా క‌లిసి ముందుకు సాగుతున్న ప‌రిస్థితి కాగ‌డా పెట్టి వెతికినా క‌న‌ప‌డ‌టంలేదు. తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

బ‌ల‌వంత‌పు పెళ్లి
జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం, ఆ త‌ర్వాత పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ఒక‌టీ అరా మీడియా స‌మావేశాలు.. తిరుప‌తిలో రోడ్‌షో, స‌భ ఇంత‌కుమించి ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు. బీజేపీ నేత‌లు ప్ర‌చారానికే పిలవ‌లేదని క్షేత్ర‌స్థాయిలోని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇరుపార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం హ‌‌డావిడి ఉంటుంది. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్లుగా ఉంటున్నారు. ఇరుపార్టీల‌కు బ‌ల‌వంతంగా పెళ్లిచేసిన‌ట్లుంద‌నే వ్యాఖ్య‌నాలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి ఓటు వేయం
బీజేపీ అగ్ర‌నేత‌లు జ‌న‌సేన‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌చారం చేస్తున్నామ‌ని చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌రిష్మా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది వారి భావ‌న‌. కానీ జ‌న‌సేన నుంచి స్పంద‌న ఉండ‌టంలేదు. ఎందుకంటే జ‌న‌సేన‌ను బీజేపీ క‌లుపుకుపోవ‌డంలేద‌నేది ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన వాస్త‌వం. జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్రచారానికి వ‌చ్చి వెళ్లార‌ని, ఆయ‌న‌పై అభిమానం ఉన్న వాళ్లు బీజేపీకి ఓటు వేస్తార‌ని, అంత‌కంటే త‌మ పార్టీకి ఒరిగేదేమీ లేదంటూ బీజేపీ నాయ‌కులు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో మాత్రం బీజేపీ -జ‌న‌సేన మ‌ధ్య స‌మ‌న్వ‌యలేమి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీకి ఓట్లువేయ‌మంటూ ఇప్ప‌టికే తిరుప‌తిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు తీర్మానం చేశారు. ఆ పార్టీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం, తామంతా ఓట్లేయ‌డమ‌న్న‌ది నేతిబీర‌కాయ‌లో నెయ్యిచందంగా ఉంటుంద‌ని పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. జ‌న‌సేన‌లోని అసంతృప్తి తిరుప‌తి ఎన్నిక‌ల్లో ఎటువంటి ప్ర‌భావం చూపుతుంద‌నేది ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాతే తేల‌నుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>