PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/finance-cheating-latest-newsa57de62d-af6b-489b-be38-7f3eeb3ccb40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/finance-cheating-latest-newsa57de62d-af6b-489b-be38-7f3eeb3ccb40-415x250-IndiaHerald.jpgప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ను ఆస‌రాగా చేసుకున్న ఓ కంపెనీ కావ‌ల్సినంత మూట‌గ‌ట్టుకుంది. వాటిని వేరే ప్రాంతానికి త‌ర‌లించింది. బోర్డు తిప్పేసిన కంపెనీ నిర్వాహ‌కులు ద‌ర్జాగా ప‌రార‌య్యారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఘ‌రానా మోసం వెలుగు చూసింది. ప్రజల అత్యాశ ఫలితంగా రూ.50 కోట్లో.. రూ.100 కోట్లో కాదు.. కొట్టేసింది.. ఏకంగా 300 కోట్ల రూపాయలు కొట్టేశారు. "లక్ష రూపాయలు కట్టండి.. నెలకు 30వేల రూపాయలు వడ్డీష అన్నారు. ప్ర‌జ‌లు కూడా గుడ్డిగా న‌మ్మేశారు. ఒక‌సారి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకొని అలా ఇవ్వ‌డం సాధ్య‌మేనా? అfinance, cheating, latest news;sunil;policeరూ.300 కోట్ల‌కు బోర్డు తిప్పేసిన కంపెనీరూ.300 కోట్ల‌కు బోర్డు తిప్పేసిన కంపెనీfinance, cheating, latest news;sunil;policeThu, 15 Apr 2021 11:08:40 GMTప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ను ఆస‌రాగా చేసుకున్న ఓ కంపెనీ కావ‌ల్సినంత మూట‌గ‌ట్టుకుంది. వాటిని వేరే ప్రాంతానికి త‌ర‌లించింది. బోర్డు తిప్పేసిన కంపెనీ నిర్వాహ‌కులు  ద‌ర్జాగా ప‌రార‌య్యారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఘ‌రానా మోసం వెలుగు చూసింది. ప్రజల అత్యాశ ఫలితంగా రూ.50 కోట్లో.. రూ.100 కోట్లో కాదు.. కొట్టేసింది.. ఏకంగా 300 కోట్ల రూపాయలు కొట్టేశారు. "లక్ష రూపాయలు కట్టండి.. నెలకు 30వేల రూపాయలు వడ్డీష  అన్నారు. ప్ర‌జ‌లు కూడా గుడ్డిగా న‌మ్మేశారు. ఒక‌సారి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకొని అలా ఇవ్వ‌డం సాధ్య‌మేనా? అన్న విష‌యాన్ని గ‌మ‌నంలో ఉంచుకుంటే వారి సొమ్ము వారి ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉండేది. రూ.30వేల వడ్డీ అనేసరికి ప్రజలంతా ఎగబడి మరీ డబ్బులు సమర్పించుకున్నారు.

కొన్నాళ్లు వ‌డ్డీ చెల్లించారు
ప్ర‌జ‌ల్లో నమ్మకం కుదిర్చేందుకు కొన్నాళ్ల పాటు వడ్డీలు కూడా చెల్లించింది ఆ సంస్థ. దీంతో జనాల్లో ఆశ మరింత పెరిగింది. కొందరు కోట్ల‌రూపాయ‌ల్లో సమర్పించుకున్నారు. మరికొందరు అప్పులు చేసి మరీ డబ్బులు కట్టారు. అలా 300 కోట్ల రూపాయలు పోగైన తర్వాత, ఓ మంచి ముహూర్తం చూసుకొని కంపెనీ బోర్డు తిప్పేసింది. 2 నెలలుగా వడ్డీ రాకపోయేసరికి ప్ర‌జ‌ల‌కు అనుమానం వచ్చింది. ఏజెంట్ల ఫోన్లు స్విచాఫ్ అవ‌డంతో వారి అనుమానం నిజమైంది. లబోదిబోమంటూ వెళ్లి ధర్మవరం డీఎస్పీకి మొరపెట్టుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు చిన్న చిన్న సొమ్ముల‌కు సంబంధించిన ఫిర్యాదులే వ‌చ్చాయి. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఇది 300 కోట్ల రూపాయల ఘ‌రానా మోసమని తేలింది. కొంత‌మంది పోలీసులు కూడా ఈ సంస్థ‌కు ఏజెంట్లుగా చేర‌డం అత్యంత విషాద‌క‌ర‌మైన అంశం.

ఈబీఐడీడీ
రూ.300 కోట్ల‌కు బోర్డు తిప్పేసిన ఈ కంపెనీ పేరు ఈబీఐడీడీ. సునీల్ కడియాల మేనేజ‌రుగా వ్య‌వ‌హ‌రించారు. మిగ‌తావారు ఎంత‌మంది ఉన్నారు? ఎవ‌రెవ‌రికి వాటాలున్నాయి? త‌దిత‌ర విష‌యాల‌న్నీ పోలీసుల ద‌ర్యాప్తులోనే వెలుగులోకి రానున్నాయి. ముందుగా వీరంతా ఎటువైపు వెళ్లివుంటార‌నే కోణంలో ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ కంపెనీకి ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రించిన పోలీసులెవ‌రు?  వారు ఎంత‌మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు క‌ట్టించారు?  వారికి క‌మీష‌న్ ఎంతిచ్చారు? ర‌సీదులున్నాయా? త‌దిత‌ర కోణంలో కూడా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>