Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pant85d5b74c-617c-4b00-accc-4f7e6fd1648f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pant85d5b74c-617c-4b00-accc-4f7e6fd1648f-415x250-IndiaHerald.jpgఅయ్యర్ గైర్హాజరీలో తొలి సారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్‌పై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంత్‌ను ఆకాశానికెత్తేస్తున్నాడు. తనకు రిషబ్‌ పంత్‌లో కోహ్లీ, విలియమ్సన్‌లు కనిపిస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అతడి దూకుడులో కోహ్లీ కనిపిస్తుంటే, కెప్టెన్సీలో విలియమ్సన్‌ను గుర్తుకు తెస్తున్నాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ ఐపీఎల్‌లో పంత్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ రావాలనే దానిపై తమకు క్లారిటీ లేదని, కానీ అతనికి..rishabh pant;rani;delhi;virat kohli;rajasthan;rishabh pant;sanju samson;yuva;dookudu;paruguపంత్‌లో వాళ్లిద్దరూ కనిపిస్తున్నారు.. రాజస్థాన్‌తో మ్యాచ్ ముందు కోచ్ ప్రశంసలుపంత్‌లో వాళ్లిద్దరూ కనిపిస్తున్నారు.. రాజస్థాన్‌తో మ్యాచ్ ముందు కోచ్ ప్రశంసలుrishabh pant;rani;delhi;virat kohli;rajasthan;rishabh pant;sanju samson;yuva;dookudu;paruguThu, 15 Apr 2021 16:53:07 GMTఇంటర్నెట్ డెస్క్: అయ్యర్ గైర్హాజరీలో తొలి సారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్‌పై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంత్‌ను ఆకాశానికెత్తేస్తున్నాడు. తనకు రిషబ్‌ పంత్‌లో కోహ్లీ, విలియమ్సన్‌లు కనిపిస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అతడి దూకుడులో కోహ్లీ కనిపిస్తుంటే, కెప్టెన్సీలో విలియమ్సన్‌ను గుర్తుకు తెస్తున్నాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ ఐపీఎల్‌లో పంత్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ రావాలనే దానిపై తమకు క్లారిటీ లేదని, కానీ అతనికి నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ బాగా కలిసొచ్చిందని, ఆ స్థానాల్లోనే అతడు బ్యాటింగ్‌కు దిగేలా చూస్తామని చెప్పాడు. అయితే కీపింగ్‌లో మాత్రం పంత్ కొంత మెరుగవ్వాలని, కొన్నిసార్లు అనవసర తప్పులు చేస్తున్నాడని, వాటిని సరిదిద్దుకుంటే అతడు మేటి కీపర్‌గా కూడా పేరు తెచ్చుకోగలడని అన్నాడు. అయితే రాజస్థాన్‌తో మ్యాచ్ ముందు పంత్‌పై ఆ జట్టుకోచ్ ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో కేవలం 18.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ రేపు రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుండడంతో ఈ పోటీపై భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా.. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కొత్తగా గురువారం జరగబోతున్న రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఈ సీజన్ ద్వారా తొలిసారి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు తలపడబోతుండడం అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ ద్వారా పోటీ పడబోతున్నారు. ఇద్దరూ టీమిండియా యువ ఆటగాళ్లు కావడం, ఈ సీజన్‌తోనే తొలిసారి వీరిద్దరూ కెప్టెన్లుగా ఎంపిక కావడం, అలాగే వారిపై ఉన్న అంచనాలను తగ్గట్లుగానే ఇద్దరూ తొలి మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించడం ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగానే పెంచుతున్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ సెంచరీతో అదరగొట్టగా.. చెన్నైతో మ్యాచ్‌లో పంత్ చక్కటి కెప్టెన్సీ స్కిల్స్ చూపించాడు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో..? అదిరిపోయే ఆటతో అభిమానులను అలరిస్తారో వేచి చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>