PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli20df4fdd-5d73-4c76-a4ec-9bc88bef6777-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli20df4fdd-5d73-4c76-a4ec-9bc88bef6777-415x250-IndiaHerald.jpgఅతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. శారీరకంగా కూడా వారిని హింసించాడు. అతీత శక్తుల కోసం చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు ముగ్గురు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లలు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారుMADANAPALLI;shiva;andhra pradesh;district;police;marriage;tamilnadu;lord siva;wife;local language;father;madanapalliపిల్లల నరబలికి ప్లాన్! మదనపల్లి సీన్ రిపీట్పిల్లల నరబలికి ప్లాన్! మదనపల్లి సీన్ రిపీట్MADANAPALLI;shiva;andhra pradesh;district;police;marriage;tamilnadu;lord siva;wife;local language;father;madanapalliWed, 14 Apr 2021 10:45:10 GMTఅతీత శక్తుల కోసం కన్న బిడ్డలను బలి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ఘటన మరవక ముందే అలాంటి మరొకటి వెలుగు చూసింది. తమిళనాడులో మరో దారుణ ఘటన జరిగింది.అతీత శక్తుల కోసం కన్న బిడ్డలను నరబలి ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధమవడం కలకలం రేపుతోంది.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32) దంపతులకు.. దీపక్‌ (15), కిషాంత్‌ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. రామలింగం ఆ ప్రాంతంలో చీరల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో రామలింగానికి.. ఇందుమతి అనే మహిళతో రెండో వివాహం జరిగింది. ఆమెను కూడా అరైల్‌నగర్‌ లోనే వేరే ఇంట్లో ఉంచాడు రామ లింగం.

రామలింగం రెండో భార్య ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఇదే సమయంలో మొదటి భార్య రంజితతో ధనలక్ష్మికి పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల గడిచాక.. వారిద్దరిని చూసి రామలింగం.. మీరిద్దరూ శివుడు, పార్వతిలా ఉన్నారని కామెంట్స్ చేసేవాడు. కాలక్రమేణ వీరి పరిచయం పెరిగి.. తాము పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా రామలింగం ఓకే చెప్పాడు. దీంతో రామలింగం.. ఇంట్లోనే తన కుమారుల ఎదుటే రంజిత ,ధనలక్ష్మికి  వివాహం చేశాడు.

వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నాక.. అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. శారీరకంగా కూడా వారిని హింసించాడు. అతీత శక్తుల కోసం చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు ముగ్గురు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లలు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స్పష్టించింది. హైటెక్ యుగం లోనూ అతీత శక్తుల కోసం కన్న బిడ్డలను నరబలి ఇవ్వాలని చూడటం విస్మయపరుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>