Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sentiment-of-mumbai-indians-worked-out-in-this-season-alsocb700501-cea7-4acf-b298-542dea4fa012-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sentiment-of-mumbai-indians-worked-out-in-this-season-alsocb700501-cea7-4acf-b298-542dea4fa012-415x250-IndiaHerald.jpgఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ ఎప్పటిలానే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఎప్పటిలానే తొలి మ్యాచ్‌లో ఓడింది. అలాగే ఆ తరువాతి మ్యాచ్‌లోనే తేరుకుని విజయం సాధించింది. ముంబై ఇలా తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌లో ఓడిన ప్రతిసారీ ఐపీఎల్ టైటిల్ కొట్టింది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్నా...ipl 2021;rohit;mumbai;delhi;rohit sharma;2019;2020;twitter;bengaluru 1;chennai;winnerముంబైకి వర్కౌటైన సెంటిమెంట్.. ఈ సారి కూడా కప్ ఆ జట్టుదేనా..?ముంబైకి వర్కౌటైన సెంటిమెంట్.. ఈ సారి కూడా కప్ ఆ జట్టుదేనా..?ipl 2021;rohit;mumbai;delhi;rohit sharma;2019;2020;twitter;bengaluru 1;chennai;winnerWed, 14 Apr 2021 19:01:35 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ ఎప్పటిలానే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఎప్పటిలానే తొలి మ్యాచ్‌లో ఓడింది. అలాగే ఆ తరువాతి మ్యాచ్‌లోనే తేరుకుని విజయం సాధించింది. ముంబై ఇలా తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌లో ఓడిన ప్రతిసారీ ఐపీఎల్ టైటిల్ కొట్టింది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్నా.. 2013 నుంచి టోర్నీలో ముంబై ఇండియన్స్ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతోంది.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న వాళ్లను చూస్తే... మనం సెంటిమెంటల్ ఫూల్స్ అంటుంటాం. అలా అని వారు సెంటిమెంట్ ను లైట్ గా తీసుకోరు. ఎందుకంటే వారి నమ్మకం వారిది. ఇక ఐపీఎల్ లోనూ సెంటిమెంట్ ను ఫాలో అవుతోంది ఓ జట్టు. మరి వారి సెంటిమెంట్ ఈ సారి ఫలిస్తుందా.. లేదా బెడిసికొడుతుందా..?  

ఈ సీజన్‌లోనూ ఆడిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడింది. అలాగే రెండో మ్యాచ్‌లో ఓటమి అంచుల నుంచి కోలుకుని అద్భుత విజయం సాధించింది. అంటే మళ్లీ సెంటిమెంట్ రిపీట్ అయింది. దీంతో ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ముంబై జట్టే టైటిల్ విజేత అంటూ సోషల్ మీడియాలో ఆ జట్టు అభిమానులను తెగ హల్‌చల్ చేస్తున్నారు. గత సీజన్ల(2019, 2020)లోనూ ముంబై ఇదే సెంటిమెంట్ ఫాలో అయిందని, ఆ రెండు టోర్నీల్లోనూ ముంబై జట్టే విజేతగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు.

2019 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ చెన్నై చేతిలో ముంబై ఓడింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచింది. ఇక 2020లో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచింది. ఈ రెండు సార్లుకూడా ట్రోఫీని అందుకుని ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. కాగా.. ఈ సీజన్లోనూ అదే సెంటిమెంట్ ఫాలో కావడంతో ట్రోఫీని సాధింస్తుందనేది అభిమానుల వాదన.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ 13 సీజన్లలో ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ విజేతగా నిలిచింది. ఈ 5 సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆ జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. మరి ఈ సారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయిన నేపథ్యంలో ట్రోఫీని ముంబై గెలుస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి.

">
">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీలో లోకేష్ టార్గెట్ ?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>