PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peddireddy-jaganfa910cd1-1cf8-4884-86a7-b0e0cedcc8b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peddireddy-jaganfa910cd1-1cf8-4884-86a7-b0e0cedcc8b1-415x250-IndiaHerald.jpgవిష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రచారం చేస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌హ‌జంగానే అధికార పార్టీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను రెఫ‌రెం డంగా స్వీక‌రిస్తారా? అంటూ.. అధికార పార్టీకి స‌వాల్ రువ్వారు. అయితే.. దీనిపై సీఎం జ‌గ‌న్ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ, మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ప్ర‌తిస‌వాల్ రువ్వారు. ఇక్క‌డ టీడీపీ గెలిస్తే.. వైసీపీకి ఉన్న 21 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని అన్నారు. peddireddy jagan;tiru;mp;రాజీనామా;minister;letter;tdp;ycp;reddy;partyవైసీపీ ఎంపీల‌కు నాయ‌కుడు ఎవ‌రు? పెద్దిరెడ్డా ? జ‌గ‌నా ?వైసీపీ ఎంపీల‌కు నాయ‌కుడు ఎవ‌రు? పెద్దిరెడ్డా ? జ‌గ‌నా ?peddireddy jagan;tiru;mp;రాజీనామా;minister;letter;tdp;ycp;reddy;partyWed, 14 Apr 2021 10:28:00 GMTరాజ‌కీయాల్లో ఎంత సీనియ‌ర్ అయినా.. నేత‌ల‌కు కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. ఎన్నిక‌ల్లో ఎన్ని సార్లు గెలిచినా.. ఆయా పొర్టు ఫోలియోల‌ను బ‌ట్టే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ.. వైసీపీలో మాత్రం మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇటీవ‌ల కాలంలో `నేనే కింగ్‌` అనే రేంజ్‌లో మాట్లాడుతున్నారు. వాస్త‌వానికి పార్టీ అదినేత జ‌గ‌న్ ఏం చెబితే అది చేయ‌డ‌మే.. మంత్రి అయినా.. ఇతర నేత‌ల ప‌నైనా. గ‌తంలో అనేక మంది జ‌గ‌న్‌ను కాద‌ని వ్య‌వ‌హ‌రించి.. రాజ‌కీయంగా అభాసుపాల‌య్యారు. అయితే.. ఈ ప‌రిణామాలు గుర్తున్నాయో.. లేదో కానీ.. పెద్దిరెడ్డి మాత్రం జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ‌గా వ్యాఖ్య‌లు, స‌వాళ్లు చేస్తుండ‌డం పార్టీలోనే చ‌ర్చ‌కు దారితీస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రచారం చేస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌హ‌జంగానే అధికార పార్టీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను రెఫ‌రెం డంగా స్వీక‌రిస్తారా? అంటూ.. అధికార పార్టీకి స‌వాల్ రువ్వారు. అయితే.. దీనిపై సీఎం జ‌గ‌న్ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ, మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ప్ర‌తిస‌వాల్ రువ్వారు. ఇక్క‌డ టీడీపీ గెలిస్తే.. వైసీపీకి ఉన్న 21 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని అన్నారు.

అదే స‌మ‌యంలో వైసీపీ గెలిస్తే.. టీడీపీ ముగ్గురు ఎంపీల‌తో పాటు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌తోనూ రాజీనామా చేయిస్తారా?  దీనికి సిద్ధ‌మేనా? అని ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి అటు వైపు టీడీపీ అధినేత స‌వాల్ రువ్వారు. అంటే.. ఇటు వైపు నుంచి కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి. లేదా ఎంపీల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి వంటివారు ప్ర‌తిస‌వాల్ రువ్వాలి. కానీ, పెద్దిరెడ్డి మాత్రం జోక్యం చేసుకున్నారు. అంటే.. ఆయ‌న ఎంపీల‌కు లీడ‌ర్‌గా ఉన్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మంత్రి పెద్దిరెడ్డి తనకు లేని పెద్దరికం కల్పించుకుటున్నారని.. జగన్‌ తర్వాత తానే అని చెప్పుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారని వైసీపీలో కొంత మంది నేతలు అసహనంతో ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి స‌వాళ్లు మామూలేన‌ని దీనికి ఇంత‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న‌వారు కూడా క‌నిపిస్తున్నాయి. కాగా.. గ‌తంలోనూ పెద్దిరెడ్డి ఓ ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య చేశారు. తాను సీఎం అయితే.. టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యేద‌ని.. జ‌గ‌న్ కొన్ని నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నార‌ని అన్నారు. అప్ప‌ట్లోనూ ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌లు ఎంత దూరం వెళ్తాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>