National
oi-Rajashekhar Garrepally
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా భారతదేశ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాలేకపోయారు. కరోనా కారణంగానే ఈ భేటీ రద్దయిపోయింది.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఏప్రిల్ 12న భారతదేశానికి వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను డ్రియాన్ కలిసి మాట్లాడారు. అయితే, మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా బ్రియాన్ భేటీ కావాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విదేశాంగా వెబ్ సైట్లలో బ్రియాన్ పర్యటనకు సంబంధించి పేర్కొన్న వియాలను కూడా తొలగించారు. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రధానితో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి భేటీ కావడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఏ ఇతర వివరాలను వెల్లడించలేదు. ఇటీవల మాల్దీవుల మంత్రి కూడా మోడీతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, బారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో డ్రియాన్, ఇతర అధికారులు భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయమే ఈ మంత్రుల భేటీలను రద్దు చేసినట్లు సమాచారం.
భారతదేశంలో పర్యటించిన 10 మంది విదేశాంగ మంత్రుల్లో 9 మంది ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాలేకపోయారు. రష్యా, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ లాంటి మిత్రదేశాల మంత్రులు కూడా వీరిలో ఉండటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ తీరికలేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న క్రమంలోనే ఈ భేటీలు రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూఎస్ అధికారులు మాత్రమే ప్రధానితో భేటీ అయ్యారు.