SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news8d5f898f-017d-41c8-ad34-4f55e0923c9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news8d5f898f-017d-41c8-ad34-4f55e0923c9a-415x250-IndiaHerald.jpg ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్..కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. 153 పరుగుల ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో దినేష్ కార్తీక్ పై ఆండ్రూ రసూల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కే‌కే‌ఆర్ ఓటమి పై ఘాటు విమర్శలు చేశాడు. సునాయసంగా విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రసెల్‌, డీకేలు అలsports news;rana;karthik;mumbai;twitter;letter;paruguఐపీఎల్ 2021 : కే‌కే‌ఆర్ ఓటమి పై వెల్లువెత్తుతున్న విమర్శలు !!ఐపీఎల్ 2021 : కే‌కే‌ఆర్ ఓటమి పై వెల్లువెత్తుతున్న విమర్శలు !!sports news;rana;karthik;mumbai;twitter;letter;paruguWed, 14 Apr 2021 19:43:58 GMT ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్..కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. 153 పరుగుల ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో దినేష్ కార్తీక్ పై ఆండ్రూ రసూల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కే‌కే‌ఆర్ ఓటమి పై ఘాటు విమర్శలు చేశాడు. సునాయసంగా  విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రసెల్‌, డీకేలు అలసత్వం ప్రదర్శించారని సెహ్వాగ్ అన్నాడు. 

సరిపడా బంతులు, చేతిలో వికెట్లున్నా ఎదురుదాడి చేయకపోవడం ఏంటని నిలదీశాడు. జట్టును గెలిపించాలన్న కసి దినేష్ కార్తీక్ లోనూ, రసూల్ లోనూ కనిపించలేదని, వీరి కంటే ముందు బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్‌, నితీశ్ రాణా, షకిబ్‌, మోర్గాన్‌లు జట్టును గెలిపించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేశారని, ఈ క్రమంలో వారు వికెట్లు కోల్పోయారని, కానీ రసెల్‌, డీకేల పరిస్థితి అలా కనిపించలేదని సెహ్వాగ్ విమర్శించాడు. కే‌కే‌ఆర్ చేతులారా పరాజయం పొందడంతో  జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాడు. షారుక్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ''మ్యాచ్‌ ఓడిపోయినందుకు క్షమించండి.. ముంబై చేతిలో ఓడినప్పటికి తమ కుర్రాళ్లపై పూర్తి విశ్వాసం ఉందని.. రానున్న మ్యాచ్‌ల్లో అది నిలుపుకుంటారన్న నమ్మకం ఉంది'' అంటూ ట్వీట్‌ చేశాడు. 

ఇక షారుక్ ట్వీట్ పై ఆ జట్టు ఆటగాడు ఆండ్రూ రసూల్ స్పందిస్తూ.. .."షారుఖ్‌ చేసిన ట్వీట్‌ను నేను సమర్థిస్తాను. ఓటమి అనేది ప్రతీ జట్టుకు మామూలే. క్రికెట్‌ అంటే ఇలాగే ఉంటుంది. ఎంత ఆసక్తికరంగా సాగినా.. చివరికి ఏదో ఒక జట్టు ఓడిపోవాల్సిందే. ముంబై ఇండియన్సతో మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాం. మా కుర్రాళ్ల ప్రదర్శన బాగానే ఉంది.. వారిపై ఆత్మవిశ్వాసం ఉంది. మ్యాచ్‌లో ఓటమి చెందడంపై నిరాశం చెందాం.. కానీ ఇది ముగింపు కాదు.. లీగ్‌లో ఇది మాకు రెండో మ్యాచ్‌ మాత్రమే. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం". అంటూ చెప్పుకొచ్చాడు.
" style="height: 606px;">
" style="height: 231px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రి ఎంట్రీ లో హ్యాట్రిక్ మీద కన్నేసిన శ్రుతి హసన్

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>