PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-ap-sharmila31fcdefb-b5d5-481f-8899-829002fee2ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-ap-sharmila31fcdefb-b5d5-481f-8899-829002fee2ad-415x250-IndiaHerald.jpgదివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్నంత‌కాలం ఏనాడూ రాజ‌కీయ తెర‌పై క‌న‌ప‌డ‌లేదు. చ‌క్క‌గా ఇంట్లో త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్లేవారు. వ‌చ్చిన అతిథుల‌కు కొస‌రి కొస‌రి వ‌డ్డించేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. భ‌ర్త మ‌ర‌ణాన్ని దిగ‌మింగుకొని కుమారుడి కోసం బ‌య‌ట‌కు రాక‌త‌ప్ప‌లేదు. ఆమే వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేసింది. జ‌గ‌న్‌తో పాటు విజ‌య‌ల‌క్ష్మి కూడా కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ ఏర్పాట‌వ‌ycp, jagan, ap, sharmila;tara;visakhapatnam;y. s. rajasekhara reddy;congress;vishakapatnam;alla ramakrishna reddy;letter;pulivendula;ycp;vemuri radhakrishna;partyజ‌గ‌న్ మాట కాద‌న్న‌ విజ‌య‌ల‌క్ష్మి?? ష‌ర్మిలకు మ‌ద్ద‌తు!!జ‌గ‌న్ మాట కాద‌న్న‌ విజ‌య‌ల‌క్ష్మి?? ష‌ర్మిలకు మ‌ద్ద‌తు!!ycp, jagan, ap, sharmila;tara;visakhapatnam;y. s. rajasekhara reddy;congress;vishakapatnam;alla ramakrishna reddy;letter;pulivendula;ycp;vemuri radhakrishna;partyWed, 14 Apr 2021 08:27:00 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్నంత‌కాలం ఏనాడూ రాజ‌కీయ తెర‌పై క‌న‌ప‌డ‌లేదు. చ‌క్క‌గా ఇంట్లో త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్లేవారు. వ‌చ్చిన అతిథుల‌కు కొస‌రి కొస‌రి వ‌డ్డించేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. భ‌ర్త మ‌ర‌ణాన్ని దిగ‌మింగుకొని కుమారుడి కోసం బ‌య‌ట‌కు రాక‌త‌ప్ప‌లేదు. ఆమే వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేసింది. జ‌గ‌న్‌తో పాటు విజ‌య‌ల‌క్ష్మి కూడా కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ ఏర్పాట‌వ‌గానే పులివెందుల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి సొంత మ‌రిది వివేకానంద‌రెడ్డిపై భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఒక పార్టీ అధ్య‌క్షురాలిగా ఉండి మ‌రోపార్టీ స‌భ‌కు హాజ‌ర‌య్యారు
2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం పులివెందుల సీటు వ‌దులుకున్న వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ కుటుంబ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ఓట‌మిగా నిలిచింది. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఆమె గౌర‌వ అధ్య‌క్షురాలి హోదాలో ఉన్నారు. వేమూరు రాధాకృష్ణ రాసిన రాత‌ల‌కు కౌంట‌ర్‌గా ఆమె ఓ లేఖ కూడా రాశారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమె గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉండి.. తెలంగాణ‌లో పార్టీ పెడుతోన్న ష‌ర్మిల సంక‌ల్ప స‌భ‌కు హాజ‌ర‌వ‌డ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక పార్టీ అధ్య‌క్షురాలిగా ఉండి మ‌రోపార్టీ స‌భ‌కు ఎలా హాజ‌ర‌వుతారంటూ చ‌ర్చించుకుంటున్నారు.

సొంత మీడియాలో వార్త‌లు లేవు
ఓ వైపు ష‌ర్మిల కొత్త పార్టీపై జ‌గ‌న్‌ గుర్రుగా ఉన్నారు. సొంత మీడియాలో  ష‌ర్మిల వార్త‌ల‌కు క‌వ‌రేజ్ ఇవ్వ‌డంలేదు. ష‌ర్మిల‌కు కొత్త పార్టీ వ‌ద్ద‌ని తాము చెప్పామ‌ని.. అయినా ఆమె విన‌లేదంటూ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బ‌హిరంగంగానే చెప్పారు. ఈ కుటుంబంలో అభిప్రాభేదాలున్న‌ట్లు దీన్నిబ‌ట్టే అర్థ‌మైపోతోంది. ‌త‌ల్లికి కూడా జ‌గ‌న్ దూరంగా ఉంటున్నారా? అనే సందేహం అంద‌రిలో త‌లెత్తుతోంది.  దీనికి తోడు వివేకా హత్యోదంతం ఇప్పుడు ర‌గులుతోంది. ఒక‌వైపు కుటుంబానికి జ‌గ‌న్ దూరంగా ఉన్నార‌ని, మ‌రోవైపు విజ‌య‌ల‌క్ష్మి ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో వైసీపీలో కూడా గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతోంది. దీనికి ప‌రిష్కా‌రం ఎప్పుడు దొరుకుతుందో? ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డంలేదు!.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>