PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgజ‌న‌సేన పార్టీని ప్రారంభించిన కొత్త‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ మేనియా ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. కానీ ఎందుక‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల వ‌ర‌కే ప‌వర్ స్టార్ ప్ర‌భావం ఆగిపోయింది. అక్క‌డ కూడా కేవ‌లం ఒకే ఒక్క సీటుకు ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. భ‌విష్య‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌ల‌ప‌డింది లేదు. పార్టీ ప్రారంభించి చాలా రోజులే అయినా అస‌లు బ‌రిలోకే దిగ‌క‌పోవ‌డంpawan-kalyan;pawan;pawan kalyan;telangana;janasena;janasena party;zero;partyతెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?pawan-kalyan;pawan;pawan kalyan;telangana;janasena;janasena party;zero;partyWed, 14 Apr 2021 08:00:09 GMTజ‌న‌సేన పార్టీని ప్రారంభించిన కొత్త‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ మేనియా ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. కానీ ఎందుక‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల వ‌ర‌కే ప‌వర్ స్టార్ ప్ర‌భావం ఆగిపోయింది. అక్క‌డ కూడా కేవ‌లం ఒకే ఒక్క సీటుకు ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. భ‌విష్య‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌ల‌ప‌డింది లేదు. పార్టీ ప్రారంభించి చాలా రోజులే అయినా అస‌లు బ‌రిలోకే దిగ‌క‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డ ఉన్నా కాసింత క్యాడ‌ర్ కూడా లేకుండాపోయింది. నిజం చెప్పాలంటే తెలంగాణ‌లో అయితే ఆ పార్టీ ఉనికి జీరో అనే చెప్పాలి.


అయితే గ‌డిచి రెండు నెల‌లుగా తెలంగాణ‌లో పార్టీని విస్త‌రించేందుకు ప‌వ‌న్ పావులు క‌దుపుతున్న‌ట్లుగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. రానున్న జీడ‌బ్ల్యూఎంసీ ఎన్నిక‌ల్లో సైతం ఆ పార్టీ నేత‌లను బ‌రిలోకి దించాల‌ని యోచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇది ఆ పార్టీకి ఆరంభ‌మ‌వుతాయా..?  లేదంటే బ‌లహీన‌ప‌డ‌టానికి దోహ‌దం చేస్తాయా..? అన్న విష‌యం మ‌రి కొద్దిరోజుల్లో తేలిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల అరంగేట్రం చేస్తున్న క్రమంలోనే పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీ ఆక్టివ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తిరేపుతోంది. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారో వాటిని తీర్చేందుకు జనసేన పార్టీ వారికి అండగా నిలబడుతూ వారి తరుపున పోరాటం చేస్తుందని పవన్ ప్రకటించారు.


కొత్త పార్టీలు తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ ఎప్పటి నుంచి ఉన్నా సరైన సమయంలో పరిస్థితులను వినియోగించుకోకపోతే పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం కష్టం అనేది జనసేన నేతల్లో ఉన్న అభిప్రాయం.అయితే పవన్ కల్యాణ్ స్టాండ్ ఇప్పటికీ క్లియర్ గా లేకపోవడంతో ప్రభుత్వానికి మద్దతిస్తుందా లేక ప్రతిపక్ష స్థానంలో ఉండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ప్రజలు జనసేన వైపు ఆలోచించడానికి చొరవ చూపడం లేదన్నది మాత్రం వాస్తవం. అయితే ఇప్పటికీ తెలంగాణలో యాక్టివ్ గా లేకపోయినా అడపాదడపా రకరకాల సమస్యలపై తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ కు ఇదే నిదర్శనమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>