Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi74c66547-c652-4332-80f4-8aa2bd0beec9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi74c66547-c652-4332-80f4-8aa2bd0beec9-415x250-IndiaHerald.jpg సమాజంలో మగువల కష్టాలపై తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్‌గా కలెక్షన్ల వర్షం కురిపించింది. విమర్శకుల మన్ననలు అందుకుంది. ఈ నేపథ్యంలోనే మహిళలపై దాడులు చేసే కామాంధుల ఆటకట్టించే పవర్ ఫుల్ పోలీస్..varalakshmi;pawan;krishna;pawan kalyan;rani;varsha;cinema;media;blockbuster hit;traffic police;krack;chitramమగువల కష్టాలపై మరో సినిమా.. ఈ సారి జయమ్మతో..!మగువల కష్టాలపై మరో సినిమా.. ఈ సారి జయమ్మతో..!varalakshmi;pawan;krishna;pawan kalyan;rani;varsha;cinema;media;blockbuster hit;traffic police;krack;chitramWed, 14 Apr 2021 20:51:00 GMTఇంటర్నెట్ డెస్క్: సమాజంలో మగువల కష్టాలపై తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్‌గా కలెక్షన్ల వర్షం కురిపించింది. విమర్శకుల మన్ననలు అందుకుంది. ఈ నేపథ్యంలోనే మహిళలపై దాడులు చేసే కామాంధుల ఆటకట్టించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ కథతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్‌‌లో మన జయమ్మ.. అదేనండి.. వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించనుంది.

ఈ చిత్రంలో డ్రగ్స్‌ ముఠా అంతుచూసే పోలీస్‌ అధికారి పాత్రలో వరలక్ష్మి నటించింది. ఈ చిత్రానికి ‘చేజింగ్‌’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసింది. విదేశాల నుంచి డ్రగ్స్‌ చట్టవిరుద్ధంగా మన దేశానికి సరఫరా చేస్తూ కోట్లకు పడగెత్తిన మాఫియా ముఠాను అంతం చేసే పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి నటించారు. ఈ మాఫియాను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ వారి ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ కథగా చేజింగ్‌ చిత్రం ఉండనుంది.

అంతేకాకుండా కన్నెపిల్లలపై మత్తు పదార్థాలను ప్రయోగిస్తూ వారి మానాన్ని దోచుకుని ఆ తర్వాత దారుణంగా హత్యలు చేసే కామాంధుల ఆట కట్టించే స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా అదరగొట్టబోతోంది.లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా రూపొందిన ఈ సినిమాను ఏషియన్‌ మీడియా పతాకంపై మదియళగన్‌ మునియాండి నిర్మించారు. కేకే కుమార్‌ దర్శకత్వం వహించగా, దసి సంగీతాన్ని, కృష్ణ స్వామి ఛాయాగ్రహణం అందించారు. మరి ఈ సినిమాతో జయమ్మ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో వరలక్ష్మి శరత్‌కుమార్‌‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా జయమ్మ పాత్ర స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక క్రాక్ తరువాత నాంది సినిమాలో కూడా వరలక్ష్మి లాయర్ పాత్రలో అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే ఛాలెంజ్ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మూవీ టీం భావిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ చేసిన పనికి తిరుపతిలో ప్లస్సా. మైనస్సా...?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>