PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgక‌రోనా కేసుల్లో భార‌త్ బ్రెజిల్‌ను దాటేసింది. ప్రపంచంలోని కొవిడ్19 మొత్తం కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటి వ‌ర‌కు అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవల భారత్‌లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య బ్రెజిల్‌ను దాటేసింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అమెరికాలో 3,11,98,055 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఇప్పుడు భారత్ చేరింది. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717 కాగా, మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్‌corona;india;brazil;hardwar;american samoaభార‌త్‌లో 2ల‌క్ష‌ల‌కు చేరువ‌లో కేసులు.. బ్రెజిల్‌ను దాటేసిన ఇండియాభార‌త్‌లో 2ల‌క్ష‌ల‌కు చేరువ‌లో కేసులు.. బ్రెజిల్‌ను దాటేసిన ఇండియాcorona;india;brazil;hardwar;american samoaWed, 14 Apr 2021 10:38:18 GMTక‌రోనా కేసుల్లో భార‌త్ బ్రెజిల్‌ను దాటేసింది. ప్రపంచంలోని కొవిడ్19 మొత్తం కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటి వ‌ర‌కు అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవల భారత్‌లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య బ్రెజిల్‌ను దాటేసింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అమెరికాలో 3,11,98,055 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఇప్పుడు భారత్ చేరింది. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717 కాగా, మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఆ సంఖ్య 1,34,82,023గా నమోదైంది. ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 13,61,36,954గా నమోదైంది.


మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు దేశంలో  కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా బుధ‌వారం విడుద‌ల చేసిన బులిటెన్‌లో  ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు లెక్క‌ల్లో ఉండ‌టం భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. సోమ‌వారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు  దేశంలో 1,85,190 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరింది.  ఇందులో 1,23,36,036 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనాతో 24 గంటల్లో 1026 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొతం కరోనా మరణాల సంఖ్య 1,71,929కి చేరింది.  


భార‌త్‌లో క‌రోనా విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుండ‌టంతో కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని అంత‌ర్జాతీయ అధ్య‌య‌న సంస్థ‌లు పేర్కొంటున్నాయి. తాజాగా ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు చేరింది. మహాకుంభ్ సందర్భంగా వేల సంఖ్యలో పోగవడంతో వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సోమవారానికే హరిద్వార్ లో 408కేసులు  న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గడిచిన 24గంట‌ల్లో ఉత్తరాఖాండ్ లో 13కొవిడ్ మృతులు, వెయ్యి 925కేసులు నమోదైయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఒకవైపు, హాస్పిటల్స్ బెడ్ లు లేకపోవడం మరోవైపు ఉన్నప్పటికీ గుంపులుగా ఘాట్ ల వద్ద కనిపిస్తూనే ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ సన్యాసి అవ్వాలనుకుని హీరో అయ్యాడా..!!

వకీల్ సాబ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు..!

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>