Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021d713b428-3d10-4919-8a07-0f6b28b33296-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021d713b428-3d10-4919-8a07-0f6b28b33296-415x250-IndiaHerald.jpgఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం నుంచి హైటెన్షన్ వాతావరణంలో సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి పంజాబ్ కింగ్స్ గెలిచింది. మ్యాచ్‌లో ఓటమి తర్వాత రాజస్థాన్ ఆల్‌రౌండర్ ర్యాన్ పరాగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. కానీ, అతడి బాధ అర్థం చేసుకుని ఓదారుస్తున్నారు. గెలుపోటములు సహజమని,..ipl 2021;rahul new;rahul;rani;k l rahul;shivam dube;rajasthan;twitter;job;sanju samson;rahul sipligunj;punjab;ben stokes;paruguనేనో చెత్త ఆటగాడినంటూ రాజస్థాన్ ఆటగాడి పోస్ట్.. నెటిజన్లు రిప్లై ఏంటేంటేనేనో చెత్త ఆటగాడినంటూ రాజస్థాన్ ఆటగాడి పోస్ట్.. నెటిజన్లు రిప్లై ఏంటేంటేipl 2021;rahul new;rahul;rani;k l rahul;shivam dube;rajasthan;twitter;job;sanju samson;rahul sipligunj;punjab;ben stokes;paruguTue, 13 Apr 2021 20:08:35 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం నుంచి హైటెన్షన్ వాతావరణంలో సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి పంజాబ్ కింగ్స్ గెలిచింది. మ్యాచ్‌లో ఓటమి తర్వాత రాజస్థాన్ ఆల్‌రౌండర్ ర్యాన్ పరాగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. కానీ, అతడి బాధ అర్థం చేసుకుని ఓదారుస్తున్నారు. గెలుపోటములు సహజమని, తర్వాతి మ్యాచ్‌లో మరింత గొప్పగా రాణించే సత్తా అతడిలో ఉందని మద్దతుగా నిలుస్తున్నారు.

తమ కెప్టెన్ అంత గొప్పగా పోరాడుతున్నా.. తాను కనీస సపోర్ట్ ఇవ్వలేకపోయానంటూ ర్యాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం 'నేను చెత్త' (im shit) అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. అయితే కొద్ది సేపటి తరువాత రియాన్ పరాగ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించాడు.

ఇదిలా ఉంటే 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా రాజస్థాన్ జట్టు అద్భుతంగా పోరాడింది. పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అతడికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ స్టోక్స్(0), మనన్ వోహ్రా(14), జోస్ బట్లర్(25), శివమ్ దూబే(23), ర్యాన్ పరాగ్(25), రాహుల్ తెవాటియా(2) క్రీజులో ఎక్కవ సేపు నిలబడలేకపోయారు. దీంతో భారమంతా శాంసన్‌పైనే పడింది. అయినప్పటికీ ఒంటరి పోరాటం చేసిన సంజు.. విజయం అంచుల వరకు జట్టును లాక్కొచ్చాడు. అతడు పోరాడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. అయితే శాంసన్ సెంచరీతో అదరగొట్టినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 217 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాదో ఓటమిపాలైంది.
">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నూజివీడు నుంచి ఢిల్లీకి మొదటి కిసాన్ రైలు...

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>