PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishadhagaadha-doctor-dasaradharam-visaakhapatnam392bfd45-b364-4062-83d8-770c7bb4858a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishadhagaadha-doctor-dasaradharam-visaakhapatnam392bfd45-b364-4062-83d8-770c7bb4858a-415x250-IndiaHerald.jpgతల్లి దండ్రులు మనకు కనిపించే దేవుళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక బిడ్డకు దేవుని కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. అలాంటి తల్లి దండ్రులను వదిలేసి మన బ్రతుకు మనం చూసుకుంటే అది చాలా పాపం..విశాఖపట్టణానికి చెందిన దసరధరామ్ అనే ఓ వైద్యుడు కొన్ని దశాబ్దాలపాటు పదిమందికీ వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించాడు. కానీ ఇప్పుడు దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తున్నాడు. భార్య మరణం, కూతుళ్ల బాధ్యత, కొడుకు చేసిన మోసంతో మానసికంగా కుంగిపోయాడు. డాక్టర్ దసరాధరామ్ కు ఇద్దరూ కూతుళ్లు ఒక కొడుకు వున్నాడు. ఇద్దరి కూతుళ్ళలో తన చిన్నVishadhagaadha, Doctor dasaradharam, visaakhapatnam;deva;jeevitha rajaseskhar;vishakapatnam;doctor;wife;local language;central governmentదిక్కులేని స్థితిలో ఓ వైద్యుడి విషాద గాధ.....దిక్కులేని స్థితిలో ఓ వైద్యుడి విషాద గాధ.....Vishadhagaadha, Doctor dasaradharam, visaakhapatnam;deva;jeevitha rajaseskhar;vishakapatnam;doctor;wife;local language;central governmentTue, 13 Apr 2021 21:10:00 GMTతల్లి దండ్రులు మనకు కనిపించే దేవుళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక బిడ్డకు దేవుని కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. అలాంటి తల్లి దండ్రులను వదిలేసి మన బ్రతుకు మనం చూసుకుంటే అది చాలా పాపం..విశాఖపట్టణానికి చెందిన దసరధరామ్ అనే ఓ వైద్యుడు కొన్ని దశాబ్దాలపాటు పదిమందికీ వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించాడు. కానీ ఇప్పుడు దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తున్నాడు. భార్య మరణం, కూతుళ్ల బాధ్యత, కొడుకు చేసిన మోసంతో మానసికంగా కుంగిపోయాడు.



డాక్టర్ దసరాధరామ్ కు ఇద్దరూ కూతుళ్లు ఒక కొడుకు వున్నాడు. ఇద్దరి కూతుళ్ళలో తన చిన్న కూతురుకి మతి స్థిమితం లేదు. పెద్ద కూతురు ఆశ్రమంలో ఉంటుంది. ఇక కుమారుడు పెద్ద దుర్మార్గుడు.ఆస్తి రాయించుకోని వదిలేయడంతో రోడ్డు పక్కనే బతుకీడిస్తూ.. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని దీన స్థితిలో ఉన్నాడు.గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడు విశాఖలోని సీతమ్మదార డాక్టర్స్‌ కాలనీలో దిక్కులేని వ్యక్తిగా పడి వున్నారు.


మతి స్థిమితంగా లేకపోవడంతో ఎవరినీ సాయమడిగే పరిస్థితిలోనూ లేరు. పదవీ విరమణ అనంతరం మద్దెలపాలెంలో సొంతంగా క్లినిక్‌ నడిపారు. సీతమ్మదార వుడా అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండేవారు. ఒడుదొడుకులు తట్టుకుంటూ జీవితం వెళ్లదీసిన ఆయన.. ఏడు నెలల క్రితం భార్య మరణంతో మానసికంగా కుంగిపోయారు. అద్దెకున్న అపార్ట్‌మెంట్‌ను యజమాని ఖాళీ చేయించడంతో సమీపంలోని దుకాణాన్నే నివాసంగా మార్చుకున్నారు.


ప్రస్తుతం ఆసలేం జరుగుతుందో తెలియని స్థితిలో ఆయన ఉన్నారు. ఉద్యోగ జీవితం గురించి తప్ప ఇతర విషయాలేవీ గుర్తులేవంటున్నారు.భార్య మరణమే దశరథరామ్‌ కష్టాలకు కారణమని స్థానికులు అంటున్నారు. ఆరునెలల క్రితం వరకు ఆయన ప్రాక్టీస్‌ కొనసాగించారని చెబుతున్నారు. డాక్టర్‌ అవస్థలు చూసి స్థానికులు ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ మహానగర పాలక సంస్థ అధికారులు ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 80 ఏళ్ల వయస్సులో డా.దశరథరామ్‌ కష్టాలను చూసి అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>