MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/herald-ugadi-20218e18d497-5d87-4d07-ac4b-bbbe423a1c73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/herald-ugadi-20218e18d497-5d87-4d07-ac4b-bbbe423a1c73-415x250-IndiaHerald.jpgతెలుగు ఉగాది ఎపుడూ వస్తుంది. అందరికీ తీపి, చేదు, పులుపు, వగరు అన్ని రుచులనూ పండిస్తుంది, అందరికీ అందిస్తుంది. అయితే నాటి ఉగాదులు ఎన్నో తీపి గురుతులను మిగిల్చాయని గట్టిగానే చెప్పాలి. ఉగాది వస్తుందంటే చాలు వరసపెట్టి సినిమాలను ఆనాడు విడుదల చేసేవారు. herald-ugadi-2021;cinema;festival;audienceఉగాది మారలేదు కానీ తెలుగు సినిమా మారిపోయింది...?ఉగాది మారలేదు కానీ తెలుగు సినిమా మారిపోయింది...?herald-ugadi-2021;cinema;festival;audienceTue, 13 Apr 2021 12:00:00 GMTతెలుగు ఉగాది ఎపుడూ వస్తుంది. అందరికీ తీపి, చేదు, పులుపు, వగరు అన్ని రుచులనూ పండిస్తుంది, అందరికీ అందిస్తుంది. అయితే నాటి ఉగాదులు ఎన్నో తీపి గురుతులను మిగిల్చాయని గట్టిగానే చెప్పాలి.

ఉగాది వస్తుందంటే చాలు వరసపెట్టి సినిమాలను ఆనాడు విడుదల చేసేవారు. తెలుగు నాట ఉగాది కూడా అతి పెద్ద పండుగ. పైగా వేసవి ఆరంభంలో వస్తుంది. దాంతో కలెక్షన్లకు కొదవ లేని సీజన్. అందుకే అలనాటి నటులు పోటీ పడి సినిమాలను రిలీజ్ చేసేవారు. వివిధ జానర్లలో రూపొందించిన ఆ సినిమాలు అన్నీ కూడా రిలీజ్ అయి దాదాపుగా హిట్ అయ్యేవి. ఇక ఇపుడు చూస్తే ఉగాది వేళ సినిమాలు రిలీజ్ అన్నది పెద్దగా లేదు. ఈసారి వకీల్ సాబ్ సందడి చేస్తున్నాడు కానీ మామూలుగా అయితే సినిమాల రిలీజ్ కి ఉగాది వంటి బ్రహ్మాండమైన సీజన్ ని ఎందుకో ఎంచుకోవడంలేదు. ఇక ఉగాది సహా ఏ పండుగ వచ్చినా తమ సినిమాలకు సంబంధించిన టీజర్లు, మోషన్ పోస్టర్లు, అప్ డేట్స్ ఇవే హీరోలు రిలీజ్ చేస్తూ ఆనందిస్తున్నారు.

దీని కారణం ఇపుడు సినిమా మేకింగ్ కి చాలా టైమ్ తీసుకుంటున్నారు. దాంతో ఈ మధ్యలో చాలా ఉగాదులు వెళ్ళిపోతున్నాయి. ఇక ఫ్యాన్స్ ని నిరాశపెట్టరాదని ఇలా టీజర్లతోనే కధ నడుపుతున్నారు. వీటిని చూసే అభిమానులు కూడా పొంగిపోవాల్సివస్తోంది. మొత్తానికి నాటికీ నేటికీ సినీ రంగం మాత్రం చాలా మారిపోయింది అనే చెప్పాలి. వేగంగా సినిమా తీస్తే ఎపుడూ నిర్మాతకు లాభమే. మేకింగ్ కి అయ్యే బడ్జెట్ సగానికి సగం మిగులుతుంది.కానీ తెలుగు సహా అన్ని భాషల్లోనూ కూడా ఇపుడు అసలు బడ్జెట్ కంటే ఇలా ఏళ్ళ తరబడి సినిమా తీయడానికి అయ్యే అనవసరపు ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఈ ఉగాది నుంచి అయినా త్వరగా సినిమాలు తీయడానికి సినీ మేకర్స్ రెడీ అయితే అది పరిశ్రమకూ మేలు, ఆడియన్స్ కి కూడా ఆ కంటెంట్ ఫ్లావర్ చెడిపోకుండా అందుతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>