Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hit-movies602a8216-f847-47f6-8198-d88bebc20e82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hit-movies602a8216-f847-47f6-8198-d88bebc20e82-415x250-IndiaHerald.jpg గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓ టి టి ప్లాట్ఫారం లో హోమ్ థియేటర్ గా మారిపోయాయి. థియేటర్లో మూతపడడంతో ఎక్కడికి పోయే అవకాశం లేక ఓటీపీ ద్వారా ప్రేక్షకులను పలకరించారు మన హీరోలు. అయితే కొన్ని సినిమాలు థియేటర్ కి వచ్చి హిట్ అయ్యాయి. అలాగే మరికొన్ని సినిమాలు అమెజాన్ ప్రైమ్, ఓటిటి ద్వారా విడుదలయ్యాయి. అయితే సినిమా థియేటర్ కి రాకుండానే సూపర్ హిట్ అయిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. hit movies;venkatesh;anand malayalam actor;aparna;editor mohan;prema;pujitha;ramana;rishi;sandhya;sudha;suhas;surya sivakumar;varsha;mumbai;guntur;american samoa;cinema;telugu;cinema theater;amazon;kancharapalem;tamil;2020;love;car;november;cinema theatre;wife;october;evening;hero;girl;success;house;father;research and analysis wing;lie;sudha k prasad;araku valley;anand deverakonda;dookudu;maha;devarakonda'థియేటర్'కి రాకుండానే హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా?'థియేటర్'కి రాకుండానే హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా?hit movies;venkatesh;anand malayalam actor;aparna;editor mohan;prema;pujitha;ramana;rishi;sandhya;sudha;suhas;surya sivakumar;varsha;mumbai;guntur;american samoa;cinema;telugu;cinema theater;amazon;kancharapalem;tamil;2020;love;car;november;cinema theatre;wife;october;evening;hero;girl;success;house;father;research and analysis wing;lie;sudha k prasad;araku valley;anand deverakonda;dookudu;maha;devarakondaTue, 13 Apr 2021 01:00:00 GMT
 గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓ టి టి ప్లాట్ఫారం లో హోమ్ థియేటర్ గా మారిపోయాయి. థియేటర్లో మూతపడడంతో ఎక్కడికి పోయే అవకాశం లేక ఓటీపీ ద్వారా ప్రేక్షకులను పలకరించారు మన హీరోలు. అయితే కొన్ని సినిమాలు  థియేటర్ కి వచ్చి హిట్ అయ్యాయి. అలాగే మరికొన్ని సినిమాలు  అమెజాన్ ప్రైమ్, ఓటిటి ద్వారా విడుదలయ్యాయి. అయితే సినిమా థియేటర్ కి రాకుండానే సూపర్ హిట్ అయిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రేమ కథలన్నీ సుఖాంతం అవ్వవు. విషాదాంత ప్రేమ కథలు ఇప్పటి వరకు మనం ఎన్నో చూశాం. కులం, మతం, పేదధనిక అంతరం అనే కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో చాలా ప్రేమకథలు వచ్చాయి. కానీ, ప్రేమకు వర్ణం అడ్డంకి అనే కాన్సెప్ట్‌తో తొలిసారి వచ్చిన చిత్రం ‘కలర్ ఫోటో’. ఒక వ్యక్తి రంగు ప్రేమకు అంతరాయం అయితే ఎలా ఉంటుంది అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆహా’లో అక్టోబర్ 23న విడుదలైంది.ఇందులో నటీనటుల విషయానికి వస్తే సుహాస్, చాందిని తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా సుహాస్.. జయకృష్ణ పాత్రలో ఒదిగిపోయారు. తను పలికించే చిన్న చిన్న హావభావాలు కచ్చితంగా ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో సుహాస్ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక చాందిని సైతం దూకుడుగా ఉండే అమ్మాయి పాత్రలో ఇమిడిపోయింది. సహజ నటనతో ఆకట్టుకుంది.



 తమిళ హీరో సూర్య, ప్రతిభావంతురాలైన దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన చిత్రం ‘సూరారై పోట్రు’. ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా!’ పేరిట తెలుగులోకి అనువాదం చేశారు. సూర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. నవంబర్ 11వ తేదీ రాత్రి 10.30 గంటల నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది.సూర్య భార్య సుందరి అలియాస్ బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలమురళి నటన కూడా చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన గడసరి అమ్మాయిగా పాత్రలో జీవించేసింది. ఆమె పాత్ర చిత్రీకరణలో దర్శకురాలు సుధ కొంగర మార్క్ కనబడింది. మహా-బేబీ రిలేషన్‌షిప్ సినిమాకు ఉన్న ప్రధాన బలాల్లో ఒకటి. సూర్య, అపర్ణ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పాత్రలకు తోడు సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తూ నడిపించారు దర్శకురాలు. మోహన్ బాబు పాత్ర చిన్నదే అయినా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు.



  లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా చేరారు. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది.టైటిల్‌కు తగ్గట్టే ఇదో మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోయావాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు. కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ, సంధ్యకు వాళ్ల నాన్న వేరే సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.



ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020 లో మహా వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశ్‌ ఇంటే ప్రతికారం చిత్రాన్ని తెలుగులోకి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా పునర్నిర్మాణం చేశారు.[1]నటుడు సత్యదేవ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. కేరాఫ్‌ కంచరపాలెంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది. ఈ చిత్రం కోవిడ్ కారణంగా సినిమా హాళ్ళు అందుబాటులో లేనందున 2020 జూలై 30 జూలై న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయినది.ఉమామహేశ్వరరావు (సత్యదేవ్‌) అరకులో ఫొటోగ్రాఫర్‌. మా ఊరికి అతనొక్కడే ఫోటోగ్రాఫర్. ఏ కార్యక్రమమైనా అతనిని పిలుస్తారు. ఉమామహేశ్వరరావుకి చిన్నప్పటి నుంచి గొడవలంటే భయం. చిన్నతనంలో స్కూళ్లో కలసి చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకరోజు అనుకోకుండా రోడ్డు మీద జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్లి దెబ్బలు తింటాడు. అందరి ముందు తన్నులు తినడంతో పరువు పోయిందని భావిస్తాడు. తనని కొట్టినవాడిని తిరిగి కొట్టిన తర్వాతే మళ్లీ చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయికి అమెరికా సంబంధం రావడంతో ఇద్దరూ విడిపోతారు. మరి తనని కొట్టిన వాడిపై మహేశ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. అనేది ఈ సినిమా కథ.



ఇటీవలే నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి అనేక ఆసక్తికర సినిమాలు విడుదల కావడం మనం చూసాము. అలా ఇప్పుడు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబడిన చిత్రం “గతం”.
అమెరికా లో ఉన్న ఒక హాస్పిటల్ లో రిషి(రాకేష్) తన గతాన్ని మర్చిపోయి ట్రీట్మెంట్ నుంచి లేస్తాడు. అక్కడ అతని గర్ల్ ఫ్రెండ్ అదితి(పూజిత) అతడి తండ్రి దగ్గరకు చేర్చేందుకు సహాయం చెయ్యడానికి ట్రై చేస్తుంది. ఆ క్రమంలో కారులో అతన్ని తీసుకెళ్తుండగా సడెన్ గా రోడ్ పై వారి కారు బ్రేక్ డౌన్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో వారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి(భార్గవ పోలుదాసు) ఇద్దరికీ లిఫ్ట్ ఇచ్చి వారి ఇంటికే అని తీసుకెళ్తాడు. కానీ అదే సమయంలో ఊహించని విధంగా రిషి, అదితిలు అతడు వారిని టార్గెట్ చేసాడని తెలుసుకుంటారు. ఇంతకీ ఈ అజ్ఞ్యాత వ్యక్తి ఎవరు? వాళ్ళకి ఇతనికి సంబంధం ఏమిటి? రిషి ఎందుకు గతం మర్చిపోయాడు అన్నవి అసలు అసలు కథ



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>