PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-situation78e53ed4-5a1e-4909-94db-6008ba56332a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-situation78e53ed4-5a1e-4909-94db-6008ba56332a-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ జోరుమీదుంది. ఎంతలా అంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలంతా సమిష్టిగా పోటీపడి మరీ వైసీపీ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. దీనికి ఉదాహరణలే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు ముసినిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. రాష్ట్రములో ప్రతిపక్షపార్టీగా ఉన్న టీడీపీ వైసీపీ విజయం ముందు నిలవలేకపోయింది. AP-TDP-SITUATION;cbn;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;smart phone;tirupati;panchayati;parliment;husband;tdp;ycp;janasena party;research and analysis wing;yevaru;partyటీడీపీ భూస్థాపితం... అచ్చెన్నాయుడు దీనికి సాక్ష్యం...?టీడీపీ భూస్థాపితం... అచ్చెన్నాయుడు దీనికి సాక్ష్యం...?AP-TDP-SITUATION;cbn;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;smart phone;tirupati;panchayati;parliment;husband;tdp;ycp;janasena party;research and analysis wing;yevaru;partyTue, 13 Apr 2021 15:27:06 GMT
" style="height: 355px;">
ఏపీలో వైసీపీ జోరుమీదుంది. ఎంతలా అంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలంతా సమిష్టిగా పోటీపడి మరీ వైసీపీ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. దీనికి ఉదాహరణలే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు ముసినిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. రాష్ట్రములో ప్రతిపక్షపార్టీగా ఉన్న టీడీపీ వైసీపీ విజయం ముందు నిలవలేకపోయింది. ఎంతలా అంటే కనీసం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనూ తన పట్టు నిలుపుకోలేకపోయారు. రాష్ట్రంలోని కొంత మంది ముఖ్య నేతల పరిస్థితి సైతం ఇదే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జోరు ముందు టీడీపీ శ్రేణులు బేజారయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పొంతనలేని రాజకీయాలతో పార్టీ పరువును మరింత దిగజార్చుకున్నారు. కనీసం పార్టీలోని కార్యకర్తలు కూడా చంద్రబాబును గౌరవించడం లేదంటే పార్టీ పరిస్థితి ఏ స్థాయికి పడిపోయిందో సగటు మానవుడికి కూడా అర్ధమవుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోవు తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తిరుపతి నుండే తమ వ్యవహారాలను రాజకీయ ప్రణాళికలను చేసుకుంటూ ఉన్నారు. టీడీపీ కూడా మంచి ప్రణాళికతోనే ప్రచారాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా విడుదలయిన ఒక వీడియో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా...? అసలు ఆ వీడియోలో ఎవరున్నారో తెలుసా...? మీరు చూస్తే షాక్ అవ్వడం ఖాయం... ఈ వీడియోలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరియు అతని అనుచరులు ఉన్నారు. అయితే అనుచరులెవరో స్పష్టంగా తెలియకపోయినా...ఇందులో మాట్లాడిన కొన్ని మాటలు రాజకీయంగా సంచలనాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఇంతకీ విషయమేమిటో తెలుసా...?


ఈ వీడియోలో ఒక వ్యక్తి అచ్చెన్నాయుడుతో ఈ విధంగా తన వేదనను చెబుతున్నాడు, "సార్...ఏమిటి సార్ మన పరిస్థితి ఇలా అయిపోయింది...? కొందరు అతని ఫోన్ కూడా తీయడం లేదని చెబుతున్నాడు..వారిలో రాజగోపాల్ మరియు రమేష్ పేర్లు ఆ వ్యక్తి చెప్పాడు. వారు ఫోన్ తీయకపోగా కావాలంటే మీ ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకోండని అన్నాడని సదరు వ్యక్తి అచ్చెన్నాయుడికి చెప్పాడు. తాను పార్టీలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని..కానీ మా లాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తల ఫోన్ తీయకపోతే ఎలా అని అచ్చెన్నాయుడు ముందు తన గోడు విన్నవించుకున్నాడు. దీనికి అచ్చెన్నాయుడు చెప్పిన సమాధానం..వదిలేయ్ రా...తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిపోతే అందరూ ఫ్రీ అయిపోతారు...తరువాత ఆ పార్టీ లేదు..ఏమీ లేదు అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అచ్చెన్నాయుడు అదేమైనా మన పార్టీనా వదిలేయరా అని ఆ వ్యక్తికి ధైర్యం చెప్పడం షాక్ కి గురిచేసింది. 

ఈ వీడియోలో సమాచారం ప్రకారం ఏపీలో టీడీపీ పని అయిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీనో లేదా బీజేపీనో జనసేన పార్టీనో టీడీపీ పని అయిపోయిందని చెప్పడం మనము చూశాము. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...?ఏదేమైనా ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికల ముందు ఇలాంటి ఒక వీడియో వైరల్ కావడం టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.  

 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు ఆ రేంజ్‌లో ఉన్నాయా..?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>