7 వేల ఎకరాలకు నీరిచ్చినట్టు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటా.. జానారెడ్డి సవాల్

Nalgonda

oi-Shashidhar S

|

నాగార్జున సాగర్ ఉపఎన్నిక సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతోంది. సీఎం కేసీఆర్‌కు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి సవాల్‌ విసిరారు. ఎల్‌ఎల్‌సీ-2లో 7వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరూపిస్తే సాగర్ ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే 90 శాతం వరద కాలువ పనులు పూర్తయ్యాయని జానారెడ్డి తెలిపారు.

హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీగా విభజించి అన్ని అనుమతులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌పై లిఫ్ట్‌లపై కేసీఆర్‌ ఏనాడూ సమీక్ష చేయలేదని విమర్శించారు. తన ఆలోచన ఫలితమే లెఫ్ట్‌ కెనాల్‌పై లిఫ్ట్‌లు అని జానారెడ్డి తెలిపారు. అంతేకాదు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించాక ఎన్నికలు కలుషితం అయ్యాయని జానారెడ్డి విరుచుకుపడ్డారు.

jana reddy challenge to cm kcr

టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్‌లో ఏం చేశారని టీఆర్ఎస్‌కు ఓటేయాలని సూటిగా ప్రశ్నించారు. ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం కేసీఆర్‌ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని జానారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ తనను అడిగి ఉంటే నోముల కుటుంబం కోసం పోటీ నుంచి తప్పుకునేవాడినని జానారెడ్డి పేర్కొన్నారు. డబ్బు, మద్యం, తప్పుడు హామీలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ఓటర్లకు విజ్ఙప్తి చేశారు. ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని అన్నారు. ఉప ఎన్నికలలో మహాజన సోషలిస్టు పార్టీని గెలిపించాలని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *