BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202117d6ecb1-64f7-4219-b999-aa993032ca6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-202117d6ecb1-64f7-4219-b999-aa993032ca6e-415x250-IndiaHerald.jpgఎన్నికల సంఘం 24 గంటల నిషేధం విధించినందుకు నిరసనగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ధర్నాకు దిగారు. కోల్‌కతాలోని మయో రోడ్డులో గాంధీ విగ్రహం ఎదుట ఉదయం 11.40 గంటలకు నిరసన చేపట్టిన దీదీ.. సాయంత్రం వరకు కొనసాగించారు. శిబిరంలో మ‌మ‌త ఒక్క‌టే ఉన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. మంగళవారం మమత రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. రాత్రి 8.00 గంటల తర్వాత నిషేధం ముగియనుండటంతో బారాసాత్, బిధelections-2021;mamata benerjee;benarjee;bharatiya janata party;korcha;west bengal - kolkata;narendra modi;mohandas karamchand gandhi;prime minister;election;army;election commission;mamta mohandas;party;narendraఆర్మీనే హ‌డ‌లెత్తించిన దీదీఆర్మీనే హ‌డ‌లెత్తించిన దీదీelections-2021;mamata benerjee;benarjee;bharatiya janata party;korcha;west bengal - kolkata;narendra modi;mohandas karamchand gandhi;prime minister;election;army;election commission;mamta mohandas;party;narendraTue, 13 Apr 2021 16:04:00 GMTఎన్నికల సంఘం 24 గంటల నిషేధం విధించినందుకు నిరసనగా ప‌శ్చిమ బెంగాల్  ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మంగళవారం ధర్నాకు దిగారు. కోల్‌కతాలోని మయో రోడ్డులో గాంధీ విగ్రహం ఎదుట ఉదయం 11.40 గంటలకు నిరసన చేపట్టిన దీదీ..  సాయంత్రం వరకు కొనసాగించారు. దీక్షా శిబిరంలో మ‌మ‌త ఒక్కరే ఉన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. మంగళవారం మమత రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. రాత్రి 8.00 గంటల తర్వాత నిషేధం ముగియనుండటంతో బారాసాత్, బిధాన్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తారు.

అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్న ఆర్మీ అధికారులు
శిబిరంలోకి పార్టీ నేతల్ని అనుమతించలేదని, దీదీ ఒక్కరే కూర్చున్నారని టీఎంసీ నేత‌లు చెప్పారు. మమతా బెనర్జీ ధర్నాకు కూర్చున్న ప్రాంతం ఆర్మీకి సంబంధించిందని, దీనికి తాము ఎన్‌ఓసీ ఇవ్వలేదని ఈస్ట్రన్ కమాండ్‌కు చెందిన అధికారులు పేర్కొన్నారు.  ఆర్మీ పరిధిలోకి వచ్చే మాయో రోడ్డులోని గాంధీ విగ్రహం వ‌ద్ద దీదీ దీక్ష చేయ‌డానికి అనుమ‌తి కోరుతూ టీఎంసీ 9.40 గంటలకు దరఖాస్తు చేసింది.. దీనిని పరిశీలిస్తున్నాం.. ఇప్పటి వరకూ ఎన్‌ఓసీ ఇవ్వలేదు అని ఆర్మీ అధికారులు తెలిపారు. వారి అనుమ‌తితో సంబంధం లేకుండా దీదీ ద‌క్ష‌ను కొన‌సాగిస్తున్నారు.

ప్ర‌ధాన‌మంత్రికి నోటీసులు ఇవ్వండి
ముస్లిం ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ముస్లింలంతా టీఎంసీకి ఓటేసి అండగా నిలవాలంటూ దీదీ ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం దీదీకి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులపై వెనక్కి తగ్గేది లేద‌ని, ముస్లిల ఓట్లు చీల్చ‌డానికి తెర‌వెన‌క ప్రయ‌త్నాలు జరుగుతున్నాయని మమత‌ వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు అంటూ ప్రధాని మోదీ ప్ర‌తి స‌భ‌లో మాట్లాడుతున్నార‌ని, ఆయనపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయని దీదీ ఈసీని ప్రశ్నించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>