EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/political-parties-political-panchangam-herald-ugadi-2021d0cd8055-15eb-4d43-a506-6a4dbfecd46c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/political-parties-political-panchangam-herald-ugadi-2021d0cd8055-15eb-4d43-a506-6a4dbfecd46c-415x250-IndiaHerald.jpgసహజంగా ఉగాది రోజున.. అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం జరగడం ఆనవాయితీ. ఈ ఏడాది ప్లవ నామ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తారు నేతలు. అయితే రాజకీయ నాయకుల ఆఫీస్ లో వినపడే పంచాంగం కచ్చితంగా వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రజలు చెప్పే పంచాంగమే కాస్త వేరుగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్లవ నామ సంవత్సరం రాజకీయంగా ఎవరికి కలిసొస్తుంది? ఎవరిని ఇబ్బంది పెడుతుంది..? political parties, political panchangam, Herald-Ugadi-2021;pawan;ntr;lokesh;jr ntr;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;congress;mp;tirupati;parliment;husband;tdp;local language;central government;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;office;janasena party;fatherఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?political parties, political panchangam, Herald-Ugadi-2021;pawan;ntr;lokesh;jr ntr;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;congress;mp;tirupati;parliment;husband;tdp;local language;central government;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;office;janasena party;fatherTue, 13 Apr 2021 09:00:00 GMTసహజంగా ఉగాది రోజున.. అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం జరగడం ఆనవాయితీ. ఈ ఏడాది ప్లవ నామ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తారు నేతలు. అయితే రాజకీయ నాయకుల ఆఫీస్ లో వినపడే పంచాంగం కచ్చితంగా వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రజలు చెప్పే పంచాంగమే కాస్త వేరుగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్లవ నామ సంవత్సరం రాజకీయంగా ఎవరికి కలిసొస్తుంది? ఎవరిని ఇబ్బంది పెడుతుంది..?

వైసీపీకి కలిసొచ్చే ఏడాదే..?
ఇప్పటి వరకూ జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తే.. ఈ ఏడాది కూడా వైసీపీకే కలిసొస్తుందని చెప్పుకోవాలి. పంచాయతీల్లో క్లీన్ స్వీప్ చేశారు, మున్సిపాల్టీలను ఏకగ్రీవం చేసుకున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఏకంగా టీడీపీ పోటీనుంచి తప్పుకునేలా చేశారు. మొత్తమ్మీద ఈ ఏడాది పంచాంగం ఫలితాలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉంటాయని చెప్పక తప్పదు. సంక్షేమ పథకాలతో ప్రజల అభిమానం చూరగొన్న సీఎం జగన్.. వాటిని కొనసాగించినంతకాలం ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుల భారం ఎక్కువైపోయి.. ఎక్కడైనే తేడా కొడితే మాత్రం, అవే సంక్షేమ పథకాలు జగన్ విజయాల పరంపరను అడ్డుకుంటాయనడంలో సందేహం కూడా లేదు.

టీడీపీ కష్టపడాల్సిందేనా..?
తిరుపతి ఉప ఎన్నకల్లో విజయం మాదేనంటూ ఘంటాపథంగా చెబుతున్న టీడీపీ.. వాస్తవానికి వైసీపీ మెజార్టీ తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించి, ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెంచారు చంద్రబాబు. కొడుకు లోకేష్ ఒకవైపు, తండ్రి చంద్రబాబు మరోవైపు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ని చుట్టేస్తున్నారు. తిరుపతి ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా.. రాబోయే రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. జూనియర్ ఎన్టీఆర్ పేరు కార్యకర్తల నోటినుంచి వినపడుతున్న వేళ, ఈ ఏడాది ఓ శుభమహూర్తం చూసుకుని లోకేష్ ని టీడీపీకి అధినేతగా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా.. కొత్త ఏడాదయినా.. పార్టీపై లోకేష్ పట్టు సాధించి, తనని తాను నిరూపించుకుంటే.. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని అందరూ బలపరుస్తారు.

బీజేపీకి కలసి వచ్చేనా..?
ప్లవ నామ సంవత్సరం బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సంగతి పక్కనపెడితే.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తుందని తెలుస్తోంది. అధికారం చేజిక్కించుకోలేకపోయినా.. తమ ఉనికి చాటుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో పటిష్ట స్థితికి చేరుకుంటున్న కమలదళం, ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలతో బోణీ కొట్టాలని చూస్తోంది. తిరుపతిలో ఒక్క ఓటు పెరిగినా అది బీజేపీకి బలమే. 2019లో నోటాకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, ఈసారి జనసేన సపోర్ట్ తో కనీసం రెండో స్థానం సాధిస్తామంటూ చెబుతోంది. అసలు లక్ష్యం ఉప ఎన్నికల విజయమేనంటున్నా.. బీజేపీ తన ఉనికినిచాటుకోడానికి ప్రయత్నిస్తోంది.

జనసేన పరిస్థితి ఏంటి..?
ప్రతి ఎన్నికలకు కొత్త పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లే పవన్ కల్యాణ్, ఈ ప్లవనామ సంవత్సర ఉగాదిన ప్రస్తుతం బీజేపీతో జట్టుకట్టి ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఆయన కూడా చెమటోడుస్తున్నారు. అయితే ఈ ఏడాదినుంచయినా.. పవన్ కల్యాణ్ కాస్త త్యాగాలను పక్కనపెట్టి, సొంతంగా పోటీ చేసే పరిస్థితి వస్తే బాగుంటుందని జనసైనికులంటున్నారు. పొత్తులతో కాలక్షేపం చేయకుండా జనసేన ఒంటరిగా బరిలోదిగాలని ఆకాంక్షిస్తున్నారు. వకీల్ సాబ్ విజయంతో ఉగాదిని ఘనంగా ప్రారంభించిన పవన్ కల్యాణ్... రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక కాంగ్రెస్, వామపక్షాలు, ఇతరత్రా పార్టీలు.. సంవత్సరాలు మారినా.. తమ ఉనికో కోసమే కష్టపడుతున్నాయి.

 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సంవ‌త్స‌రాదిలో సింహ‌రాశి వారి భ‌విష్య‌త్ ఇలా ఉంటుంది..

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>