PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-herald-ugadi-2021d43533ca-e01c-4141-bf17-9c4e989ce060-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-herald-ugadi-2021d43533ca-e01c-4141-bf17-9c4e989ce060-415x250-IndiaHerald.jpgఉగాది అంటేనే ఒక అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. కాలం చేసే అద్భుతం. కాలానికి ఒక గొప్పతనం ఉంది. అది ఎన్నడూ వెనక్కి చూడదు. దాని గమనం ఎక్కడా ఆగదు. కాలాన్ని అలా చూస్తూ ఆది అంతూ లేకుండా మానవుడి పయనం సాగిపోవాల్సిందే. Herald-Ugadi-2021;ntr;apoorva;congress;adinarayanareddy;telugu;bhuma akhila priya;prime minister;central governmentపాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?Herald-Ugadi-2021;ntr;apoorva;congress;adinarayanareddy;telugu;bhuma akhila priya;prime minister;central governmentTue, 13 Apr 2021 10:23:45 GMTఉగాది అంటేనే ఒక అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. కాలం చేసే అద్భుతం. కాలానికి ఒక గొప్పతనం ఉంది. అది ఎన్నడూ వెనక్కి చూడదు. దాని గమనం ఎక్కడా ఆగదు. కాలాన్ని అలా చూస్తూ ఆది అంతూ లేకుండా మానవుడి పయనం సాగిపోవాల్సిందే.

ఇదిలా ఉంటే ఎన్నో ఉగాదులు వస్తాయి. కానీ కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి ఉగాది సందర్భం ఇపుడు చరిత్రలో నిలిచి ఉంది. అది 1995 ఏడాది. 1994 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో   ఎన్టీయార్  ఉమ్మాడి ఏపీలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చారు. ఇక కేంద్రంలో నాడు ప్రధానిగా మన తెలుగు వారు పీవీ నరసింహారావు ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఇద్దరూ తెలుగు వల్లభులే. మహనీయులే.

తెలుగు తెలుగు జాతిని నిలువెత్తు శిఖరాన నిలబెట్టిన వారే. అలా కొన్నాళ్ళ పాటు అక్కడా ఇక్కడా తెలుగు వెలుగులు విరజిమ్మాయి. ఇక 1995లో ఉగాది వేళ ఎన్టీయార్ ప్రధాని పీవీఎ నరసింహారావుని తన ఇంటికి స్వయగ్నా ఆహ్వానించారు. ఆయనకు ఉగాది వేళ ప్రియమైన  ఆతీధ్యం ఇచ్చి గౌరవించారు.

తెలుగు రాజకీయాలో ఇదొక సంచలనం. ఎందుకంటే అఖిల భారత‌ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు పీవీఎ నరసింహారావు. అలాగే ప్రధాని. ఇక ఎన్టీయార్ కాంగ్రెస్ పొడ గిట్టని తెలుగుదేశానికి అధినేత. కానీ ఇద్దరూ తెలుగు వారు. ఉన్నతమైన పదవులలలో ఉండడమే కాదు, ఉన్నతమైన భావాలు కూడా కలిగిన ఇద్దరు మహానుభావులు కాబట్టే వారి  కలయికతో నాటి ఉగాది అలా చరిత్రలో నిలిచిపోయింది. ఉగాది అంటే గుర్తుకు వచ్చే అపూర్వ సందర్భం ఇది అని చెప్పాలి. నాడు విభిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నా వేరు వేరు పార్టీలు అయినా కూడా తెలుగు వారి కీర్తిని పెంచిన ఇద్దరు అగ్ర నేతలు ఇలా కలసి ఉండడం మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీయార్ గ్రేట్. పీవీ గ్రేట్. వారు మన తెలుగు వారు కావడం ఇంకా గ్రేట్.
 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?

కాపుల ప‌రువు తీసిన చిరంజీవి, నాగ‌బాబు

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>