MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naagca1cf24b-e8c5-40bf-849c-d3ff9926baed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naagca1cf24b-e8c5-40bf-849c-d3ff9926baed-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నవరసాలు పండిస్తూ ఇండస్ట్రీలో తన సత్తాను చాటుకున్న హీరో నాగార్జున. ఆయన తండ్రి మాదిరిగానే ఎవెర్ గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాగే తనదైన స్టైల్ ని మిక్స్ చేసి కింగ్ గా కీర్తి గడించారు. naag;kumaar;nagarjuna akkineni;raaj kumar;simran bagga;kirti;nageshwara rao akkineni;raj;tara;cinema;king;blockbuster hit;hero;king 1;heroine;success;romantic;father;annamayyaనాగ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఉగాది...నాగ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఉగాది...naag;kumaar;nagarjuna akkineni;raaj kumar;simran bagga;kirti;nageshwara rao akkineni;raj;tara;cinema;king;blockbuster hit;hero;king 1;heroine;success;romantic;father;annamayyaTue, 13 Apr 2021 11:17:54 GMTఅక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నవరసాలు పండిస్తూ ఇండస్ట్రీలో తన సత్తాను చాటుకున్న హీరో నాగార్జున. ఆయన తండ్రి మాదిరిగానే ఎవెర్ గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాగే తనదైన స్టైల్ ని మిక్స్ చేసి కింగ్ గా కీర్తి గడించారు.

ఇదిలా ఉంటే నాగార్జునకు 1997లో అద్భుతమైన సినిమాగా అన్నమయ్య వచ్చింది. ఆ మూవీతో నాగ్ లో కొత్త కోణాన్ని తెలుగు జనాలు చూశారు. తండ్రి నాగేశ్వరరావు మాదిరిగానే నాగార్జున కూడా భక్తుడి పాత్రలకు బాగా నప్పుతారు అని రుజువు చేసిన సినిమా అన్నమయ్య. ఆ సినిమా తెలుగు నాట మోత మోగించింది. దాంతో నాగ్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఇక నాగార్జున ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇందులో నాగ్ తప్పు కూడా ఏమీ లేదు. జనాలు అన్నమయ్య హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటకు రాకపోవడం వల్లనే నాగార్జున సినిమాలు అలా వరసపెట్టి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక నాగ్ మళ్ళీ రొమాంటిక్ ఫీల్ ఉన్న సినిమాలనే నమ్ముకున్నాడు.

అలా ఆ జానర్ లో వచ్చిన మూవీయే నువ్వు వస్తావని. సిమ్రాన్ హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ 2000 సంవత్సరం ఏప్రిల్ 5న ఉగాది వేళ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా కధ సూపర్ గా ఉంటుంది. దానికి తోడు ఎస్ ఎ రాజ్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాను ఎక్కడికో తీసుకుపోయింది. ఈ సినిమాతో మళ్లీ నాగ్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ విధంగా నాగ్ కి ఆ ఏడు ఉగాది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలాగే ఉంటుంది. ఇక నువ్వు వస్తావని మూవీ సాంగ్స్ ఇప్పటికీ అందరికీ అలరిస్తాయి. అదే విధంగా ఈ సినిమా టీవీలో ఎపుడు వచ్చినా కూడా జనాలు అలాగే చూస్తారు. వ్యూయర్ షిప్ కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి నువ్వు వస్తావని మూవీతో నాగ్ కి అద్భుతమైన హిట్ ఖాతాలో పడిందని చెప్పాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో కరోనా... మరో షాకింగ్ న్యూస్

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>