MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar-murugadoss-e6a22d77-b69b-4a35-9309-bbef5e504d6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar-murugadoss-e6a22d77-b69b-4a35-9309-bbef5e504d6c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్‌లో సూర్య‌ను స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘గ‌జ‌నీ’. ఈ సినిమాతో ఇటు ద‌క్షిణాది ప్రేక్షకుల‌ను, అదే చిత్రాన్ని అమీర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెర‌కెక్కించ‌డం ద్వారా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ‌దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్.‘1947’ అనేది ఈ సినిమా టైటిల్ గా నిర్ణ‌యించారు. పీరియాడిక‌ల్ ఫిల్మ్‌గా స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలోనో లేదా స్వ‌తంత్ర పోరాట యోధుడి జీవితం ఆధారంగానో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.Shankar, murugadoss;chiranjeevi;jeevitha rajaseskhar;rajamouli;shankar;india;korea, south;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;murugadoss;producer;director;thriller;producer1;letter;a r murugadoss;darsakudu;research and analysis wing;chitramద‌క్షిణాది డైరెక్ట‌ర్ల‌దే హ‌వా..?ద‌క్షిణాది డైరెక్ట‌ర్ల‌దే హ‌వా..?Shankar, murugadoss;chiranjeevi;jeevitha rajaseskhar;rajamouli;shankar;india;korea, south;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;murugadoss;producer;director;thriller;producer1;letter;a r murugadoss;darsakudu;research and analysis wing;chitramTue, 13 Apr 2021 21:07:31 GMTకోలీవుడ్‌లో సూర్య‌ను స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘గ‌జ‌నీ’. ఈ  సినిమాతో ఇటు ద‌క్షిణాది ప్రేక్షకుల‌ను, అదే చిత్రాన్ని అమీర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెర‌కెక్కించ‌డం ద్వారా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ‌దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. ఈ సినిమా అప్ప‌ట్లో బాలీవుడ్ గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఒక‌రకంగా ద‌క్షిణాది ద‌ర్శ‌కులు బాలీవుడ్ వైపు దృష్టి పెట్టేలా బీజం వేసింద‌ని కూడా చెప్ప‌వ‌చ్చు. తాజాగా మురుగ‌దాస్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాను మురుగ‌దాస్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌టంలేదు. ఆ బాధ్య‌త‌ను కన్న‌డ‌ దర్శకుడు పొన్‌ కుమరన్‌కు అప్ప‌గించారు.  ఈయన గతంలో దర్శన్ హీరోగా ‘యాజమాన’ సినిమా చేశారు. కాగా బాలీవుడ్‌ నిర్మాత ఓం ప్రకాష్‌ భట్ తో కలిసి మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘1947’ అనేది ఈ సినిమా టైటిల్ గా నిర్ణ‌యించారు. పీరియాడిక‌ల్ ఫిల్మ్‌గా స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలోనో లేదా స్వ‌తంత్ర పోరాట యోధుడి జీవితం ఆధారంగానో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే మురుగదాస్ బృందం మాత్రం ఈ చిత్రానికి సంబంధించి ఇత‌ర వివ‌రాలేవీ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కేవలం సినిమాను మాత్రమే ప్రకటించారు. . ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా సాగుతున్న‌ట్టు స‌మాచారం. త్వరలోనే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక మ‌రో ద‌క్షిణాది స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ అంటేనే భారీ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్రెస్‌.  తొలి సినిమా నుంచీ ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల‌న్నీ అదే విష‌యాన్ని చాటుతాయి. తాజాగా శంక‌ర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ చెర్రీ  హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఇటు దర్శకుడుకి అటు హీరోకి ఇది 15వ సినిమా కావడంతో ఈ చిత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.. పొలిటికల్‌ థ్రిల్లర్ జోన‌ర్‌లో తెరకెక్కనున్న ఈ  చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు రావ‌డం ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న కొరియాకు చెందిన నటి సుజీ బే కథానాయికగా నటించనుందని సమాచారం. ఈ చిత్రం కోసం దర్శకుడు శంకర్‌ సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన ఇతర నటులతోనూ చర్చలు జరుపుతున్నారట. సినిమా ఈ ఏడాది జూలైలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.  వ‌రుస విజ‌యాల బాట‌లో సాగుతున్న‌ దిల్‌రాజు‌ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం రామ్‌చరణ్‌ - రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్ట‌డానికి ముందుగా దర్శకుడు శంకర్‌ ‘ఆర్‌సీ 15’కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు స‌న్నాహాల్లో ఉన్న‌ట్టు స‌మాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కూడా వచ్చి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది...?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>