PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bollywood46a3c911-cd88-406a-984e-362866c9e981-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bollywood46a3c911-cd88-406a-984e-362866c9e981-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొద్దిరోజులుగా సంచలనం రేపుతున్న బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజాగా మరో కొత్త అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఇందులో ఇన్వాల్వ్ అయిన‌ట్లుగా తెలిసినా.. తీగ‌లాగితే డొంక క‌దులుతోంద‌న్న చందంగా మ‌రికొంద‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ద‌రు ఎమ్మెల్యేల పేర్లు వెల్ల‌డించ‌ని అధికారులు... పూర్తి విచార‌ణ‌కు మాత్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచార‌ణ‌లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తో పాటు కొత్త‌drugs;sandeep;shankar;telangana;police;producer;kannada;mla;february;arrest;producer1;drugs;reddyడ్రగ్స్ కేసులో మ‌రి కొంత‌మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకులు..డ్రగ్స్ కేసులో మ‌రి కొంత‌మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకులు..drugs;sandeep;shankar;telangana;police;producer;kannada;mla;february;arrest;producer1;drugs;reddyTue, 13 Apr 2021 08:08:00 GMTతెలంగాణలో కొద్దిరోజులుగా సంచలనం రేపుతున్న బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజాగా మరో కొత్త అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఇందులో ఇన్వాల్వ్ అయిన‌ట్లుగా తెలిసినా.. తీగ‌లాగితే డొంక క‌దులుతోంద‌న్న చందంగా మ‌రికొంద‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ద‌రు ఎమ్మెల్యేల పేర్లు వెల్ల‌డించ‌ని అధికారులు... పూర్తి విచార‌ణ‌కు మాత్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచార‌ణ‌లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తో పాటు కొత్త‌గా వినిపిస్తున్న మ‌రికొంత‌మందిని కూడా విచారించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.


ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే  ఈ కేసులో సూత్రధారిగా ఉన్న కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శంక‌ర‌గౌడ  ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యేవారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యాపారి కలహర్ రెడ్డి, ట్రావెల్స్ యాజమాని రతన్ రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. శంకరగౌడ ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణ ఎమ్మెల్యేలను తీసుకొచ్చే బాధ్యతను కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి చూసుకునేవారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు  వీరిద్దరే కీలకంగా మారారు.


ఈ కేసు ఫిబ్రవరి 26న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని వారికి డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియా వ్యక్తుల అరెస్ట్ తో డొంక కదిలింది. ఆపై శంకర్ గౌడతో పాటు మరింత మంది వ్యాపారులు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదే కేసులో సందీప్ రెడ్డితో పాటు ఇప్పటికే ఓ చిన్న హీరోను కూడా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ముగ్గురు శాసనసభ్యుల పేర్లు ఇప్పటికే పోలీసుల రికార్డుల్లోకి ఎక్కగా, పూర్తి విచారణ జరిగితే మరింత మంది పేర్లు బయటకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే తనతో పాటు మరింత మందిని తీసుకుని వస్తుంటారని, వారు ఎవరన్న విషయాన్ని అతను మాత్రమే చెప్పగలరని భావిస్తున్నామని అన్నారు. అందుకే ఈ కేసు ముందడుగు వేసేందుకు సదరు ఎమ్మెల్యే కీలకమని భావిస్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్‌పై క‌రోనా ఎంత‌లా ప్ర‌భావం చూపుతోందంటే... పాపం నాని సినిమా..!

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>