PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-patients-masks-da1bce33-23d5-44a7-97cb-c6eedaf0be6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-patients-masks-da1bce33-23d5-44a7-97cb-c6eedaf0be6c-415x250-IndiaHerald.jpg ఇప్పుడు ఎక్కడ విన్నాగాని కల్తీ అనే మాట బాగా వినపడుతుంది. తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి వరకు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. డబ్బులు సంపాదించడమే ద్యేయంగా పెట్టుకుని అమాయకుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. అలాంటి సొమ్ము ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని వాళ్ళకి అర్ధం కావడం లేదు. కాసులకు కక్కుర్తిపడి వాళ్ళు చేసే దందాల వలన మనుషుల ఆరోగ్యం పాడయిపోతుంది. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి వాళ్ళు బ్రతికేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక గ్యాంగ్ చేసే నీచమైన పని గురించి తెలిస్తే షాక్ అవుతారు.ఇంతకీ వాళ్ళు ఏమి చేసారKarona patients, masks,;manu;nithya new;tara;smart phone;police;aqua;butterకరోనా పేషెంట్స్ వాడిన మాస్కులతో ఈ దుర్మార్గులు ఏమి చేసారో తెలుసా..??కరోనా పేషెంట్స్ వాడిన మాస్కులతో ఈ దుర్మార్గులు ఏమి చేసారో తెలుసా..??Karona patients, masks,;manu;nithya new;tara;smart phone;police;aqua;butterTue, 13 Apr 2021 18:00:00 GMTనీటి వరకు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. డబ్బులు సంపాదించడమే ద్యేయంగా పెట్టుకుని అమాయకుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. అలాంటి సొమ్ము ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని వాళ్ళకి అర్ధం కావడం లేదు. కాసులకు కక్కుర్తిపడి వాళ్ళు చేసే దందాల వలన మనుషుల ఆరోగ్యం పాడయిపోతుంది. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి వాళ్ళు బ్రతికేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక గ్యాంగ్ చేసే నీచమైన పని గురించి తెలిస్తే షాక్ అవుతారు.ఇంతకీ వాళ్ళు ఏమి చేసారో తెలుసా.. మనం నిత్యం పెట్టుకునే మాస్కులను సేకరించి వాటితో బెడ్స్ తయారు చేసి అమాయకులకు అమ్ము కుంటున్నారు. కరోనా మహమ్మారి అంటే ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. పోయినట్లే పోయి మళ్ళీ విజృంభించిన కరోనా వలన దేశంలోని ప్రజలు అందరు నానా తిప్పలు పడుతున్నారు.ఏడాది కాలంగా ముఖాలకు మాస్కులతో గడిపేస్తున్న సమాజంలో వాడేసిన మాస్కులు కుప్పలు తెప్పలుగా  పేరుకుపోతున్నాయి.ఇదే అదునుగా భావించి కేటుగాళ్ల ఈ వాడేసిన మాస్కులతో ఒక కొత్త ఆలోచన చేసారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. !!


 మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కరోనా సెకండ్ వేవ్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అంతే ఎక్కువగా అక్కడ  మాస్కుల వాడకం కూడా అధికంగానే ఉంది. ఈక్రమంలోనే అక్కడ వాడేసిన మాస్కులతో పరుపుల తయారీ చేసి కొందరు కొత్త దందాకు తెరలేపారు. ఆ రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలోఎవరో గుర్తు తెలియని వ్యక్తి  ఫోన్ కాల్ తో సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ సీన్ చూసి షాక్ తిన్నారు. ప్రజలు వాడి పారేసిన మాస్కులతో పడుకునే బెడ్లను రూపొందించి అమ్ముకుంటున్నారు. సాధారణంగా పరుపుల తయారీలో కాటన్, స్పాంజి, గుడ్డ ముక్కలు వంటివి వాడతారు. కానీ ఇక్కడ వాటి బదులు వాడేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు.


ఆగంతకుడి ఫోన్ కాల్ తో రంగంలోకి దిగిన పోలీసులు గోదాములలో సోదాలు నిర్వహించి వాడి పారేసిన మాస్కుల గుట్టలను సీజ్ చేసి తగలబెట్టారు. టన్నుల కొద్దీ వేస్ట్ మాస్కులను సేకరించిన ఈ ముఠా కొద్ది రోజులుగా పరుపుల తయారీ మొదలుపెట్టింది. ఆ వేస్ట్ మాస్కులలో కరోనా పేషేంట్లు వాడిన మాస్కులు, కరోనా ఆసుపత్రుల నుండి సేకరించిన మాస్కులు కూడా ఉన్నాయని తెలుస్తుండగా ఈ ఉదంతం బయటకు రావడంతో జలగావ్ లో ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూ ట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మేజర్ టీజర్....

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>