PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpgతెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలంగాణా సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్నాయని ఈ నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేసారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని ఆయన వెల్లడించారు. ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసkcr,trs,ts;koti;kcr;jeevitha rajaseskhar;prakruti;telangana;festival;gold;pond;tamarind;marchఉమ్మడి పాలనలో అంతా చేదుగానే ఉంది: కేసీఆర్ఉమ్మడి పాలనలో అంతా చేదుగానే ఉంది: కేసీఆర్kcr,trs,ts;koti;kcr;jeevitha rajaseskhar;prakruti;telangana;festival;gold;pond;tamarind;marchTue, 13 Apr 2021 07:00:00 GMTతెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలంగాణా సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్నాయని ఈ నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేసారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని ఆయన వెల్లడించారు.

ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని,  రైతును  వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది  రైతు జీవితంలో భాగమై పోయిందని ఆయన అన్నారు. ప్రతి ఏటా చైత్రమాసంతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని తెలిపారు.

అప్పుడప్పుడే చిగురించే వేపపూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను  తీపి, వగరు చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తున్నదని సిఎం వెల్లడించారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.  

బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న సాగు బీల్లకు మళ్లించామని సిఎం తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటున్నదని సిఎం అన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదని చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేసిన యువకుడు.. ఎందుకో తెలుసా..?

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>