PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-viveka-jagan-ycp-cbid37933fc-bf49-4096-817b-125327dc77cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-viveka-jagan-ycp-cbid37933fc-bf49-4096-817b-125327dc77cd-415x250-IndiaHerald.jpg ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. సోమవారం పులివెందుల వచ్చిన అధికారులు వివేకా సన్నిహితులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డెయిరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని సీబీఐ ప్రశ్నించింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్రెడ్డి మొబైల్ రిపేర్ కోసం సెల్ పాయింట్‌కి రావ‌డంతో ఈ కోణంలో ద‌ర్యాప్తు జ‌రిపారు.ys viveka,jagan, ycp, cbi;delhi;andhra pradesh;media;cbi;murder.;pulivendulaఢిల్లీ నుంచి ఆదేశాలు... వైఎస్ వివేకా హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రంఢిల్లీ నుంచి ఆదేశాలు... వైఎస్ వివేకా హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రంys viveka,jagan, ycp, cbi;delhi;andhra pradesh;media;cbi;murder.;pulivendulaTue, 13 Apr 2021 08:16:01 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. సోమవారం పులివెందుల వచ్చిన అధికారులు వివేకా సన్నిహితులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డెయిరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని సీబీఐ ప్రశ్నించింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్రెడ్డి మొబైల్ రిపేర్ కోసం సెల్ పాయింట్‌కి రావ‌డంతో ఈ కోణంలో ద‌ర్యాప్తు జ‌రిపారు.

ఎర్ర గంగిరెడ్డిని రెండుగంట‌లు ప్ర‌శ్నించిన అధికారులు
సీబీఐ టీమ్ వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎర్ర గంగిరెడ్డిని విచారణకు పిలిచింది. దాదాపు రెండు గంటలకు పైగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తీరుతో పాటు అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి ఆరా తీసి నివేదిక రూపొందించారు. ఈ ముగ్గురి విచారణ తర్వాత సీబీఐ అధికారులు వివేకా ఇల్లు, హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తులో వేగం పెంచి కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చే పనిలో సీబీఐ ఉంద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు.

ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత క‌ద‌లిక‌
సీబీఐ బృందంలో కొంతమంది అధికారులకు కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది. కొద్దిరోజుల క్రితం వివేకానంద‌రెడ్డి కుమారె్త సునీత ఢిల్లీ వెళ్లి కేసు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని, నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని సీబీఐ అధికారులను కోరారు. ఆ త‌ర్వాత అధికారులు మళ్లీ పులివెందుల వచ్చి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. పలువురు అనుమానితులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. మ‌రికొంద‌రిని కూడా విచార‌ణ‌కు పిల‌వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కేసు ద‌ర్యాప్తులో త‌మ‌కు న్యాయం చేయాల‌ని, నిందితులంతా ఉన్న‌త‌స్థాయి ప‌ద‌వుల్లో ఉన్నారంటూ వివేకా కూతురు సునీత ఇప్ప‌టికే ప‌లు మీడియా స‌మావేశాల్లో చెప్పారు. రోజురోజుకూ న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం పోతోంద‌న్నారు. నిందితుల‌ను శిక్షించేవ‌ర‌కు తానుమాత్రం పోరాటం ఆపేదిలేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేసిన యువకుడు.. ఎందుకో తెలుసా..?

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>