PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vakeelsaab-collections91b01522-8336-4423-8403-96818eb5bc08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vakeelsaab-collections91b01522-8336-4423-8403-96818eb5bc08-415x250-IndiaHerald.jpgఅనుకున్న‌ట్టుగానే ప‌వ‌ర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ అభిమానుల‌ను మురిపించింది. స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. కరోనా రెండోసారి ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెరుగుతున్న‌స‌మ‌యంలో వ‌చ్చినా థియేట‌ర్ల‌కు జ‌నాల్ని ర‌ప్పించింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద ఏ స్థాయి విజ‌యం అందుకున్న‌ది ఈ వారం తేలిపోనుంది. నిజానికి ఏపీ, నైజాంలో 78 కోట్ల రూపాయలు ప్రీ-రిలీజ్ థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది వకీల్ సాబ్ చిత్రం.vakeelsaab collections;business;pawan;andhra pradesh;cinema;bahubali;love;love storyవ‌కీల్ సాబ్ వ‌సూళ్లు ఆ రేంజ్‌లో ఉన్నాయా..?వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు ఆ రేంజ్‌లో ఉన్నాయా..?vakeelsaab collections;business;pawan;andhra pradesh;cinema;bahubali;love;love storyInvalid Dateఅనుకున్న‌ట్టుగానే ప‌వ‌ర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ అభిమానుల‌ను మురిపించింది. స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. కరోనా రెండోసారి ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెరుగుతున్న‌స‌మ‌యంలో వ‌చ్చినా థియేట‌ర్ల‌కు జ‌నాల్ని ర‌ప్పించింది. బాక్సాఫీసు వ‌ద్ద చాలారోజుల త‌ర్వాత కాసుల గ‌ల‌గ‌ల వినిపించింది. అధికారికంగా చెప్పకపోయినా ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు స్థాయి వ‌సూళ్లు సాధిస్తున్న‌ట్టు ప‌లు కథనాలు వచ్చేశాయి. బాహుబలి-2 తర్వాత వకీల్ సాబ్‌దే ఆ స్థాయి విజ‌యం అంటూ పవన్ క‌ల్యాణ్ అభిమానులు నెంబ‌ర్ల‌తో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు. ఈ విష‌యంలో వాస్త‌వాలు ఏ మేర‌కు ఉన్నా..సినిమా ఘ‌న విజ‌యం మాత్రం ఖాయ‌మ‌నేది ఎవ‌రూ కాద‌న‌లేనిద‌ని మొద‌టి మూడు రోజుల వ‌సూళ్లు చెపుతున్నాయి.
       
అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద ఏ స్థాయి విజ‌యం అందుకున్న‌ది ఈ వారం తేలిపోనుంది. నిజానికి ఏపీ, నైజాంలో 78 కోట్ల రూపాయలు ప్రీ-రిలీజ్ థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది వకీల్ సాబ్ చిత్రం. దీనిని బ‌ట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వారం వ‌సూళ్లు కూడా స‌హ‌క‌రించాల్సిందే. ఏపీలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఈ చిత్రానికి అడ్డంకులు సృష్టించిన విష‌యం తెలి‌సిందే. దీంతోపాటు, క‌రోనా విస్తృతి కార‌ణంగా కుటుంబ ప్రేక్ష‌కులు ఈ వారం ఏమేర‌కు థియేట‌ర్ల‌కు త‌ర‌లివ‌స్తార‌నేది ఈ చిత్రం క‌లెక్ష‌న్ల‌ను నిర్ణ‌యించ‌నుంది. ఆక్యుపెన్సీ రేటు బాగుంటేనే అటు ఎగ్జిబిట‌ర్లు, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్లు లాభాల‌తో ఒడ్డుకు చేరే అవ‌కాశ‌ముంద‌ని ప‌రిశ్రమ వ‌ర్గాలు చెపుతున్నాయి.

ప్ర‌స్తుతానికి ఈ వారం కూడా  ఏ పెద్ద సినిమా పోటీకి రాక‌పోవ‌డం వ‌కీల్‌సాబ్‌కు క‌లిసొచ్చే విష‌యమ‌ని చెప్పాలి. లవ్ స్టోరీ సినిమా విడుద‌ల‌ను ఆ చిత్ర‌బృందం వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఈ వారం రోజులు ముఖ్యంగా వీకెండ్  వ‌సూళ్ల‌పై నిర్మాత‌లు గ‌ట్టి న‌మ్మ‌క‌మే వ్య‌క్తం చేస్తున్నారు.  మొదటి 3 రోజుల వసూళ్లతో ఇప్పటికే 60శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. మరో వారం రోజులు టైమ్ ఉంది కాబట్టి సులభంగానే టార్గెట్ అందుకుంటుందని చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూ ట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మేజర్ టీజర్....

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>