MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankarc25cc48d-d44a-41fa-9521-5761cd4e587b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankarc25cc48d-d44a-41fa-9521-5761cd4e587b-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో నటుడిగా మరింత గొప్ప క్రేజ్ ని దక్కించుకున్నారు. సుకుమార్ తీసిన ఈ సినిమాలో చరణ్, చిట్టిబాబు పాత్రలో జీవించారు అనే చెప్పాలి. అయితే ఆ సినిమా తరువాత బోయపాటి చరణ్ తో తీసిన వినయ విధేయ రామ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాని అనంతరం తన మిత్రుడు ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు చరణ్. రాజమౌళి తీస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ramcharan-shankar;ntr;ram charan teja;alia bhatt;kumaar;boyapati srinu;m m keeravani;mithra;ram pothineni;rajamouli;shankar;sukumar;alluri sitarama raju;rrr movie;cinema;kollywood;media;producer;audience;director;producer1;hero;heroine;success;june;nandamuri taraka rama rao;vinaya vidheya rama;olivia morris;dilచరణ్ - శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు .... !!చరణ్ - శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు .... !!ramcharan-shankar;ntr;ram charan teja;alia bhatt;kumaar;boyapati srinu;m m keeravani;mithra;ram pothineni;rajamouli;shankar;sukumar;alluri sitarama raju;rrr movie;cinema;kollywood;media;producer;audience;director;producer1;hero;heroine;success;june;nandamuri taraka rama rao;vinaya vidheya rama;olivia morris;dilMon, 12 Apr 2021 23:40:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో నటుడిగా మరింత గొప్ప క్రేజ్ ని దక్కించుకున్నారు. సుకుమార్ తీసిన ఈ సినిమాలో చరణ్, చిట్టిబాబు పాత్రలో జీవించారు అనే చెప్పాలి. అయితే ఆ సినిమా తరువాత బోయపాటి చరణ్ తో తీసిన వినయ విధేయ రామ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాని అనంతరం తన మిత్రుడు ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు చరణ్. రాజమౌళి తీస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దానయ్య దీనిని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. అయితే దీని తరువాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించనున్న సినిమాలో నటించనున్నారు చరణ్. ఇటీవల ఈ మూవీ యొక్క అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా శంకర్ మార్క్ కథ, టేకింగ్ తో పాటు చరణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా కమర్షియల్ హంగులు కూడా ఉంటాయని, ఆ విధంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్ దీనిని తీయనున్నారని చెప్తున్నారు.

అయితే లేటెస్ట్ గా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న దిల్ రాజు, ఇటీవల మీడియా తో మాట్లాడుతూ మీలానే నేను కూడా శంకర్, చరణ్ గార్ల సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాను, జూన్ లో ఈ సినిమా పట్టాలెక్కుతోంది, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో దీనిని రిలీజ్ చేస్తాం అని ఆయన అన్నారు. మొత్తానికి తమ హీరో సినిమాకి సంబంధించి నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ఈ అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ లో ఎంతో సందడి మొదలైంది ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>