PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/only-babu0aaa6355-99d7-4a10-b533-7ffa1107ebf7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/only-babu0aaa6355-99d7-4a10-b533-7ffa1107ebf7-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా అందరూ చూస్తున్నారు. టీడీపీ వయసు ఇపుడు అచ్చంగా నలభై ఏళ్ళు. ఆ పార్టీ యవ్వన దశను దాటి ప్రౌఢ గా మారింది. ఇపుడు టీడీపీలో ఉన్న నాయకులు అంతా సీనియర్ సిటిజన్లు అయిపోయారు. ఏ జిల్లాలో చూసుకున్నా ఇదే రకమైన పరిస్థితి ఉంది. only babu;lokesh;telugu desam party;jagan;andhra pradesh;chanakya-movie-2019;telugu;chanakya;tdp;yuva;ycp;lokesh kanagaraj;father;partyచంద్రబాబేనట...నో చేంజ్...?చంద్రబాబేనట...నో చేంజ్...?only babu;lokesh;telugu desam party;jagan;andhra pradesh;chanakya-movie-2019;telugu;chanakya;tdp;yuva;ycp;lokesh kanagaraj;father;partyMon, 12 Apr 2021 14:31:01 GMTతెలుగుదేశం పార్టీ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా అందరూ చూస్తున్నారు. టీడీపీ వయసు ఇపుడు అచ్చంగా నలభై ఏళ్ళు. ఆ పార్టీ యవ్వన దశను దాటి ప్రౌఢ గా మారింది.

ఇపుడు టీడీపీలో ఉన్న నాయకులు అంతా సీనియర్ సిటిజన్లు అయిపోయారు. ఏ జిల్లాలో చూసుకున్నా ఇదే రకమైన పరిస్థితి ఉంది. చంద్రబాబు యువ రక్తం అంటారు కానీ పార్టీలో సీనియర్లు మాత్రం తమ వాటాను గట్టిగానే కోరుకుంటున్నారు. పైగా వారందరికీ కూడా చంద్రబాబే తమ నాయకుడిగా కలకాలం ఉండాలని ఉంది. చంద్రబాబు ఉంటే తమకూ మరింత కాలం రాజకీయాల్లో అవకాశం ఉంటుంది అని వారి ఆశ.

అయితే ఏపీలో పోటీగా మరో బలమైన పార్టీ ఉంది. అదే వైసీపీ. వైసీపీలో అధినేత జగన్ తో పాటు పెద్ద ఎత్తున యువతరం ఉంది. జగన్ సైతం అవకాశాలు అన్నీ కూడా యువతకే కేటాయిస్తున్నారు. దాంతో యువతరం పార్టీగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీలో కూడా మార్పులు జరగాలని అంతా  కోరుకోవడంతో తప్పు లేదు. చంద్రబాబు సైతం తన కుమారుడు లోకేష్ ని భావి వారసుడిగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ పార్టీ జనాల్లో కూడా ఇపుడు లోకేష్ కి పెద్దగా మద్దతు దక్కడంలేదు. లోకేష్ ఎంత కష్టపడుతున్నా కూడా ఆయన మీద ఒక రకమైన ముద్ర పడిపోయింది. దానికి చంద్రబాబు కూడా ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే తండ్రి ఫార్టీ యియర్స్ హిస్టరీ, చాణక్య రాజకీయం చేసే నేతగా కళ్ల ముందు ఉంటే ఆయనతో లోకేష్ ని పోలుస్తున్నారు. దాంతోనే లోకెష్ తేలిపోతున్నాడు అని అంటున్నారు.

మొత్తానికి  పార్టీ వర్గాల మాట ఏంటి అంటే 2024లో ఎన్నికల్లో చంద్రబాబే సీఎం గా ప్రొజెక్షన్ ఇస్తూ జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం ఉంటుందనిట. మరి బాబు కూడా దీనికి అంగీకరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్ లాంటి నేతను ఢీ కొట్టాలంటే బాబు సారధ్యంతో పాటు ఆయన సీఎం అంటేనే ఏపీ జనాలు టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయని టీడీపీ మేధావులు అంటున్న మాట. సో మొత్తానికి బాబు బాటలోనే టీడీపీ మరింతకాలం అని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చార్మికి పూరి జగన్నాథ్ భార్య వార్నింగ్.. అతడిని పెళ్లి చేసుకోమంటూ..

వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>