PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpgగ‌త నెల‌లోను, అంత‌కు ముందు నెల‌లోను జ‌రిగిన పంచాయ‌తీలు, స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85-90 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లు క్యూలైన్ల‌లో బారులు తీరి క‌నిపించారు.కానీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల ‌కు వ‌చ్చే స‌రికి.. మాత్రం ఈ పోలింగ్ శాతం భారీగా త‌గ్గిపోయింది. దీనికి కార‌ణం ఏంటి? అనేది వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి టీడీపీ కూడా బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో ప‌డే ఓట్ల‌న్నీ ప్ర‌భుత్వానికి పాజిటివ్ అవుతాయ‌ని.. అదే స‌మయంలో మ‌హిళ‌లysrcp;tara;andhra pradesh;letter;tdp;ycp`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!ysrcp;tara;andhra pradesh;letter;tdp;ycpMon, 12 Apr 2021 09:06:00 GMT
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `న‌వ‌ర‌త్నాలు` ప‌థ‌కాలపై ప్ర‌జ‌ల నుంచి ఆశించిన విధంగా ఫ‌లితం ఇవ్వ‌డం లేదా ?  న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటున్నారా ?  జ‌గ‌న్ భావించిన‌ట్టు.. న‌వ‌ర‌త్నాలు త‌న పార్టీకి ఎస్సెట్‌ కావ‌డం లేదా?.. ఇవీ.. ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. ఒక్క నేత‌ల మ‌ధ్య మాత్ర‌మే కాదు.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ కూడా చూచాయ‌గా.. వీటిపైనే దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ఎందుకంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం భారీగా ప‌డిపోయింది.

గ‌త నెల‌లోను, అంత‌కు ముందు నెల‌లోను జ‌రిగిన పంచాయ‌తీలు, స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85-90 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లు క్యూలైన్ల‌లో బారులు తీరి క‌నిపించారు.కానీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల ‌కు వ‌చ్చే స‌రికి.. మాత్రం ఈ పోలింగ్ శాతం భారీగా త‌గ్గిపోయింది. దీనికి కార‌ణం ఏంటి? అనేది వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి టీడీపీ కూడా బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో ప‌డే ఓట్ల‌న్నీ ప్ర‌భుత్వానికి పాజిటివ్ అవుతాయ‌ని.. అదే స‌మయంలో మ‌హిళ‌లకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌తో మ‌రింత ల‌బ్ధి చేకూరుతున్నందున‌... క్యూలైన్లు కిట‌కిట లాడ‌తాయ‌ని అనుకున్నారు. కానీ, అది కూడా జ‌ర‌గ‌లేదు.

ఎలా చూసుకున్నా.. వైసీపీ అంచ‌నాలు ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో తారుమార‌య్యాయి. వాస్త‌వానికి టీడీపీ పోటీ చేసిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు భారీ ఎత్తున రావ‌డం.. టీడీపీ బ‌హిష్క‌రించ‌గానే.. ప్ర‌జ‌లు వెన‌క్కి త‌గ్గ‌డం వంటి ప‌రిణామాలు.. సైతం వైసీపీలో గంద‌ర‌గో ళానికి దారితీశాయి. ముఖ్యంగా రాజ‌కీయ ప‌రిణామాలు.. ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న న‌వ‌ర‌త్నాలు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకున్న నేత‌ల‌కు.. ఈ ఫ‌లితాలు.. నిరాశ‌కలిగించాయ‌న‌డంలో సందేహం లేదు.

దీంతో అస‌లు న‌వ‌ర‌త్నాలు అందుకున్న వారైనా పోలింగ్ బూత్‌ల‌కు వ‌చ్చారా?  ఓట్లు వేశారా?  లేక‌.. కేవ‌లం ప‌థ‌కాలు.. ప‌థ‌కాలుగానే మిగిలిపోతున్నాయా?  గ‌తంలో టీడీపీ ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేసిన ప‌సుపు-కుంకుమ ప‌థ‌కంగానే మారుతున్నాయా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌రి ఏం తేలుస్తారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ లో కరోనా పంజా

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>