MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pawan-kalyan-vakeel-saab0148ab52-18a6-47d1-840f-807ac5e6e2a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pawan-kalyan-vakeel-saab0148ab52-18a6-47d1-840f-807ac5e6e2a9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి కొత్త‌గా చెప్పుకోవాల్సిందేమీ లేదు. సినిమాల స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌ల‌తో సంబంధం లేని క్రేజ్ అత‌డిది.అయితే ప‌వ‌ర్ స్టార్‌ వ‌కీల్ సాబ్ చిత్రానికి మాత్రం ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి స‌మ‌స్య లేకున్నా ఏపీ ప్ర‌భుత్వం నుంచి చిక్కులు ఎదుర్కొంటోంది.ఈ పరిణామాల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప‌వ‌న్ అభిమాన‌వ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.pawan kalyan, vakeel saab;chiranjeevi;andhra pradesh;telangana;cinema;party;chitramవ‌కీల్ సాబ్ వివాదంపై స్పంద‌న ఏదీ..?వ‌కీల్ సాబ్ వివాదంపై స్పంద‌న ఏదీ..?pawan kalyan, vakeel saab;chiranjeevi;andhra pradesh;telangana;cinema;party;chitramMon, 12 Apr 2021 15:05:00 GMTటాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి కొత్త‌గా చెప్పుకోవాల్సిందేమీ లేదు. సినిమాల స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌ల‌తో సంబంధం లేని క్రేజ్ అత‌డిది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీ అధినేత‌గా రాజ‌కీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే ల‌క్ష్యంతో సినిమాల‌కు విరామం ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌రువాత న‌టించిన చిత్రం‌ వకీల్ సాబ్. గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. గ‌త ఏడాదిగా క‌రోనా విల‌యంతో వ‌చ్చిన లాక్‌డౌన్ ప‌రిస్థితుల త‌రువాత ఈ రేంజ్‌లో చిత్రం విజ‌యం సాధించ‌డం మామూలు విష‌యం కాదనే చెప్పాలి. ప్ర‌స్తుతం సినిమా విజ‌యం గురించి ఇప్పుడు దేశ విదేశాలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. సాధార‌ణంగా పెద్ద హీరోల సినిమాలు భారీ బ‌డ్జెట్‌తో నిర్మాణ‌మ‌వుతాయి కాబ‌ట్టి, మొద‌టి వారం రోజుల‌ పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకుని వ‌సూళ్లు రాబ‌ట్టుకునే విధానం టాలీవుడ్‌లో న‌డుస్తోంది. ఇందుకు ప్ర‌భుత్వం కూడా వెసులుబాటు క‌ల్పిస్తూవ‌స్తోంది.

అయితే ప‌వ‌ర్ స్టార్‌ వ‌కీల్ సాబ్ చిత్రానికి మాత్రం ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి స‌మ‌స్య లేకున్నా ఏపీ ప్ర‌భుత్వం నుంచి చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియ‌ర్ షోలు, టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమతి నిరాకరించింది. నిజానికి ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్లు ముందుగానే ఆన్‌లైన్‌లో అమ్ముడుబోయాయి. ఇప్పుడు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితిని నివారించాలంటూ డిస్ట్రిబ్యూట‌ర్‌లు, ఎగ్జిబిట‌ర్లు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా.. సింగిల్ బెంచ్ మూడురోజుల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తించాలంటూ ప్ర‌భుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్ర‌భుత్వం దీనిని అంత‌టితో వ‌దిలివేయ‌కుండా దీనిపై హౌస్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో డివిజ‌న్ బెంచ్ టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు శ‌నివారానికి మాత్ర‌మే ప‌రిమితం చేస్తూ తీర్పునిచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన టికెట్ల విషయంలో ఆదివారం వరకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది.

ఈ పరిణామాల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప‌వ‌న్ అభిమాన‌వ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే రాజ‌కీయ కార‌ణాల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రానికి ఇబ్బందులు సృష్టిస్తోంద‌ని దీనిపై ఇప్ప‌టిదాకా సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం ఏమిట‌ని అభిమానులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి కరోనా లాక్‌డౌన్ సమయంలో థియేట‌ర్లు మూత ప‌డ‌టం, సినీ ప‌రిశ్ర‌మ స్తంభించిపోవ‌డంతో ఇండ‌స్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంద‌ని ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని, ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ప‌లువురు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపి త‌మ గోడు వినిపించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాధినేత‌లు కూడా సానుకూలంగానే స్పందించి వారికి కొన్ని హామీలను ఇచ్చారు.. అయితే 'వకీల్‌ సాబ్‌' సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం ఇంత‌వ‌ర‌కు సినీ ప్ర‌ముఖులెవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మెగాస్గార్ చిరంజీవి స‌హా.. మిగతా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవ‌రూ ఇంతవరకు దీనిపై నోరు విప్ప‌లేదు. దీనికి తోడు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఈ అంశం సీఎం జ‌గ‌న్ కు తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చంటూ ప‌రోక్షంగా ప్ర‌భుత్వ వైఖ‌రిని స‌మ‌ర్థిస్తున్న‌ట్టు వ్యాఖ్యానించ‌డం అభిమానుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. కాగా ఇదే విష‌యంపై ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వేడివేడిగా చర్చలు నడుస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మత గ్రంథాలలో జోక్యం చేసుకోం : సుప్రీం కోర్ట్ !!

వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>