CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/the-bride-shocked-the-groom-by-telling-him-the-name-of-the-bathroom48dcbd6a-7b4e-4fff-98f2-e79ca8824a30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/the-bride-shocked-the-groom-by-telling-him-the-name-of-the-bathroom48dcbd6a-7b4e-4fff-98f2-e79ca8824a30-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ భాద్యత తీర్చుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ తండ్రి కూడా అతని కొడుకు ఓ మంచి అమ్మయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇక కాసెపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా.. పెళ్లి తంతు నిర్వహించే పండిట్ వరకూ అంతా మోసానికి పాల్పడ్డారు.groom;vedhika;meerut;smart phone;police;village;marriage;contract;murder.;fatherవరుడికి వధువు షాక్.. బాత్రూమ్ పేరు చెప్పి టోకరా..!వరుడికి వధువు షాక్.. బాత్రూమ్ పేరు చెప్పి టోకరా..!groom;vedhika;meerut;smart phone;police;village;marriage;contract;murder.;fatherMon, 12 Apr 2021 21:00:00 GMTతల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ భాద్యత తీర్చుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ తండ్రి కూడా అతని కొడుకు ఓ మంచి అమ్మయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇక కాసెపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా.. పెళ్లి తంతు నిర్వహించే పండిట్ వరకూ అంతా మోసానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పరిధిలో గల మోదీనగర్‌లో నివసిస్తున్న యువకుడికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అయితే యువతిని పెళ్లి చేసుకోవాలంటే లక్ష రూపాయల ఎదురు కట్నం ఇవ్వాలని షరతు పెట్టారు. దానికి అంగీకరించిన యువకుడి కుటుంబ సభ్యులు.. పెళ్లి వేడికలో లక్ష రూపాయలు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. ఈ తరుణంలో ఆదివారం నాడు.. పార్తపూర్‌లో భదబ్రాల్ గ్రామంలోని ఆలయంలో యువతి, యువకుడికి వివాహ ఏర్పాట్లు చేశారు. వారి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నడుస్తోంది.

అయితే ఒప్పందంలో భాగంగా వరుడి కుటుంబం నుంచి యువతి కుటుంబానికి పెళ్లి వేదికపైనే లక్ష రూపాయలు ముట్టాయి. ఆ సమయంలో వధువు, వరుడు కలిసి పెళ్లి వేదికపై ఉన్న అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటికి నాలుగు ప్రదక్షిణలు చేశారు. ఇంతలో వరుడి కుటుంబం నుంచి డబ్బు అందడంతో.. వధువు తన నాటకాలు మొదలు పెట్టింది.

ఇక వాష్‌రూమ్‌కి వెళ్లివస్తానంటూ వేదిక నుంచి వెళ్లిన యువతి అటు నుంచి అటే ఉడాయించింది. ఒంటిపై ఉన్న నగలతో సహా, వారు ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుని పారిపోయింది. యువతి పారిపోయిందనే విషయం తెలియగానే వివాహ వేదిక వద్ద ఉన్న పురోహితుడు, యువతి తల్లిదండ్రులు సైతం అక్కడి నుంచి పారిపోయారు.

దీంతో వరుడి కుటుంబ సభ్యులు సహా వివాహానికి హాజరైన బంధువు కంగుతిన్నారు. తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించిన బాదితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకుపోయిన యువతి సహా.. ఆమె తల్లిదండ్రులు, పురోహితుడి కోసం గాలిస్తున్నారు. వధువు ఫోన్ నెంబర్ ఆధారంగా వారిని ట్రేస్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఓటమికి పాపాల భైరవులు రెడీ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>