PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-mp-raghuramkrishnamraju7e1ae372-2025-421f-8f3f-7a98ada641b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-mp-raghuramkrishnamraju7e1ae372-2025-421f-8f3f-7a98ada641b6-415x250-IndiaHerald.jpgముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిపై, సొంత పార్టీ నేత‌ల‌పై మాట‌ల‌తో విధ్వంసం సృష్టిస్తున్న న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈరోజు మ‌రోసారి పార్టీనేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. రాజ‌ధాని ర‌చ్చ‌బండ పేరుతో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భాష‌ను మార్చేశారు. ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను ఏంట్రా అంటూ సంభోదించారు. వాలంటీర్లకు సన్మానం సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులున్నాయో అద్దం ప‌ట్టాయ‌న్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలపైనా రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాycp, jagan, mp, raghuramkrishnamraju;nani;raghu;ramakrishna;jagan;mp;capital;king;perni nani;minister;ycp;research and analysis wing;party;mantraఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??ఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??ycp, jagan, mp, raghuramkrishnamraju;nani;raghu;ramakrishna;jagan;mp;capital;king;perni nani;minister;ycp;research and analysis wing;party;mantraMon, 12 Apr 2021 17:25:42 GMT

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిపై, సొంత పార్టీ నేత‌ల‌పై మాట‌ల‌తో విధ్వంసం సృష్టిస్తున్న న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈరోజు మ‌రోసారి పార్టీనేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. రాజ‌ధాని ర‌చ్చ‌బండ పేరుతో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భాష‌ను మార్చేశారు. ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను ఏంట్రా అంటూ సంభోదించారు. వాలంటీర్లకు సన్మానం సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులున్నాయో అద్దం ప‌ట్టాయ‌న్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలపైనా రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రచ్చబండ పేరుతో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎవ‌డ‌బ్బ సొమ్ముల‌తో జీతాలిస్తున్నారు?
వాలంటీర్లకు సన్మాన సభలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వాలంటీర్లను జగనన్న సైన్యాలని అభివర్ణించాడు. దీనిపై స్పందించిన ర‌ఘురామ ఏమ‌న్నారంటే.. అదేంట్రా? ఎవడబ్బ సొమ్ముతో వాలంటీర్లకు జీతాలిస్తున్నారు? ప్రజాధనంతో, ప్రభుత్వ సొమ్ముతో పనిచేసే వాలంటీర్లు జగనన్న సైన్యం ఎలా అవుతార్రా? అసలు సైన్యమంటే ఎవరో తెలుసా? రాజుగారి రాజ్యకాంక్షను తీర్చే బలగాలే కదా? మరి ఏపీలోని వాలంటీర్లు కూడా జగన్ రాజ్యకాంక్షను తీర్చేవాళ్లలాగానే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అలాంటప్పుడు వాళ్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడమేంటి? అంతగా సైన్యం కావాలనుకుంటే వైసీపీ పార్టీ నుంచే డబ్బులు ఇచ్చి పెట్టించుకోవచ్చుకదా? ప్రజా ధనంతో మేం పార్టీ సైన్యాలను నడుపుతున్నాం అని ఇప్పటికైనా బాహాటంగా ఒప్పుకున్నారుగా..

రూ.261 కోట్లు త‌గ‌లేశారు
‘‘అసలే అప్పుల్లో కూరుకుపోయిన ఏపీలో వాలంటీర్లకు సన్మానాల‌ పేరుతో రూ.261 కోట్లు తగలేశారు. ఓవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది. ఇలాంటి పనికిమాలిన పనులకోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణం. పింఛ‌ను డబ్బులు ఖాతాల్లో వేసి, రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తే పోయేదానికి అనవసరంగా ఓ వ్యవస్థను పెట్టి, దాన్ని చూసి దేశమంతా గర్విస్తోందని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు. నీటా వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగనీయనంటున్న‌ షర్మిల.. రాయలసీమకు చుక్క నీరు కూడా రానీయనని శపథాలు చేస్తున్నారు. త్వరలో పెట్టబోయే షర్మిల పార్టీకి విజయమ్మే వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉంటారా? ఒక వ్యక్తి రెండు పార్టీలకు ఆ పదవుల్లో ఉండొచ్చా?, అసలీ రాజన్న రాజ్యాల డ్రామాలేంటో అర్థం కావట్లేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిప‌డ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అల్లు అర్జున్ ఐకాన్ లో హీరోయిన్ గా ఆమెను సెలెక్ట్ చేసారా ....??

కేసీఆర్ ప్లాన్ ఫాలో అవుతున్న జగన్...?

సవాల్ కు స్పందించడం టీడీపీకి రాదా...?

అధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?

"వకీల్ సాబ్ " పెట్టిన రచ్చ ..నాగబాబు,మంత్రి పెర్ని నాని మద్య వార్..!!

ఉగాది రోజున నారప్ప నుంచి చిన్న సర్ప్రైజ్

కేసీఆర్ చేసిన తప్పుని అనుకూలంగా మార్చుకుని 10 మందికి గురిపెట్టిన బండి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>