PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china36eb938e-40a0-438d-be2c-eec00152bcba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china36eb938e-40a0-438d-be2c-eec00152bcba-415x250-IndiaHerald.jpgకరోనా.. ఇది పుట్టిందే చైనాలో.. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పేరుతో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మహమ్మారికి వ్యాక్సీన్ కనిపెట్టేశారు. వ్యాక్సీన్ పంపిణీ కూడా జోరందుకుంటోంది. మొత్తం ప్రపంచంలో కరోనాకు ఐదారు టీకాలు రెడీ అయ్యాయి. అందులో రెండు మన భారత్ నుంచే తయారయ్యాయి. అయితే కరోనా పుట్టినిల్లయిన చైనా కూడా ఓ టీకా తయారు చేసింది. చైనా తయారు చేసిన టీకా పేరు సినో వ్యాక్. ఈ వ్యాక్సీన్ ను చైనా వాడటమే కాకుండా..china;indiaమా కరోనా వ్యాక్సీన్ వేస్ట్.. ఒప్పేసుకున్న చైనా..?మా కరోనా వ్యాక్సీన్ వేస్ట్.. ఒప్పేసుకున్న చైనా..?china;indiaMon, 12 Apr 2021 08:00:00 GMTకరోనా.. ఇది పుట్టిందే చైనాలో.. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. రెండేళ్ల నుంచి  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పేరుతో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మహమ్మారికి వ్యాక్సీన్ కనిపెట్టేశారు. వ్యాక్సీన్ పంపిణీ కూడా జోరందుకుంటోంది. మొత్తం ప్రపంచంలో కరోనాకు ఐదారు టీకాలు రెడీ అయ్యాయి. అందులో రెండు మన భారత్ నుంచే తయారయ్యాయి. అయితే కరోనా పుట్టినిల్లయిన చైనా కూడా ఓ టీకా తయారు చేసింది.

చైనా తయారు చేసిన టీకా పేరు సినో వ్యాక్. ఈ వ్యాక్సీన్ ను చైనా వాడటమే కాకుండా.. అనేక దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. అంతే కాదు.. మిగిలిన దేశాలు తయారు చేసిన వ్యాక్సీన్లకు వంకలు పెడుతూ వచ్చింది. మిగతా దేశాల టీకాల సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తించేలా తప్పుడు ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఇదే చైనా మా వ్యాక్సీన్‌కు అంత సీన్ లేదని ప్రకటించేసింది. చైనాలో కనిపెట్టిన వ్యాక్సిన్‌లు బలహీనంగా ఉన్నట్లు ఆ దేశమే స్వయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని ఒప్పుకున్న చైనా వైరస్‌ నియంత్రణ అధికారులు ఆయా టీకాలను కలిపి వినియోగించడం ద్వారా సామర్థ్యం పెంచాలని చైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

ఈ విషయాన్ని చైనా వైరస్‌ నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌ గావ్‌ ఫూ వెల్లడించారు. వివిధ వ్యాక్సిన్లను కలిపి వినియోగించి వాటి  సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు  చైనాకు చెందిన సినోవాక్‌ సామర్థ్యం 50.4 శాతమేనని బ్రెజిల్‌ పరిశోధకులు కూడా గుర్తించారు. అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ 97 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

చైనా తన వ్యాక్సీన్ల సామర్థ్యం పెంచేందుకు ఎం ఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ టెక్నాలజీని పలు దేశాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. అయితే మొదటి నుంచి సాధారణ ప్రయత్నాలు చేసిన చైనా.. ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఏదేమైనా మొత్తానికి తన టీకాకు అంత సీన్‌ లేదని చైనా స్వయంగా ఒప్పుకున్నట్టయింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కు బిగ్ షాక్

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>