Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab38ba4ac8-4ae3-4547-8cfb-64013490106c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab38ba4ac8-4ae3-4547-8cfb-64013490106c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమాపై రాజకీయ దుమారం రేగుతోంది. టికెట్ రెట్ల విషయంలో అటు వైసీపీ ప్రభుత్వానికి ఇటు జనసేన, బీజేపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చింది. ఐతే వకీల్ సాబ్ కు మరో షాకిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. టికెట్ల రేట్ల పెంపుకు అనుకూలంగా సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజినల్ బెంచ్ లో సవాల్ చేయనుంది. దీనిపై హౌస్ మౌషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. వకీల్ సాబ్vakeel saab;pawan;kalyan;andhra pradesh;janasena;cinema;high court;court;ycp;house;janasena partyవకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?vakeel saab;pawan;kalyan;andhra pradesh;janasena;cinema;high court;court;ycp;house;janasena partyMon, 12 Apr 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమాపై రాజకీయ దుమారం రేగుతోంది. టికెట్ రెట్ల విషయంలో అటు వైసీపీ ప్రభుత్వానికి ఇటు జనసేన, బీజేపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చింది. ఐతే వకీల్ సాబ్ కు మరో షాకిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. టికెట్ల రేట్ల పెంపుకు అనుకూలంగా సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజినల్ బెంచ్ లో సవాల్ చేయనుంది. దీనిపై హౌస్ మౌషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. వకీల్ సాబ్ విడుదల సందర్భంగా టికెట్ రేట్ల పెంపు కోసం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజనమాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి ఊరటనిస్తూ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. దీంతో ఏపీలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది.వకీల్ సాబ్’ రిలీజ్ ముందు రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సినిమా చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో దీన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. ఎందుకంటే ఈ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దు చేశారు. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చారు.తెలంగాణలోనూ బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవు కాబట్టి ఏపీలో వాటిని రద్దు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అది అనివార్యం. కానీ టికెట్ల రేట్ల మీద నియంత్రణ తేవడం మీదే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


అయితే గత వారం రిలీజైన ‘వైల్డ్ డాగ్’తో పాటు గత కొన్ని నెలల్లో రిలీజైన చాలా సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. ‘వకీల్ సాబ్’కు మాత్రం నియంత్రణ అంటుండటం రాజకీయ కుట్రలో భాగమే అని భావిస్తున్నారు.ముందు ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచొద్దంటూ జీవో ఇవ్వడం.. ఆ తర్వాత కోర్టు ఆ జీవోను కొట్టేయడం.. ఆపై ప్రభుత్వం మళ్లీ కోర్టుకు వెళ్లి టికెట్ల రేట్లు పెంచకుండా ఆదేశాలు తెచ్చుకోవడం తెలిసిందే. అంతటితో వ్యవహారం ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఈ గొడవ ఇంతటితో ముగిసిపోలేదు. ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి మళ్లీ కోర్టుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ‘వకీల్ సాబ్’ విషయంలో ప్రభుత్వం ఎలా వివక్ష ప్రదర్శిస్తోందో వివరిస్తూ సోమవారం డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం.గత కొన్ని నెలల్లో రిలీజైన సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించి.. ‘వకీల్ సాబ్’ విషయంలో మాత్రం అడ్డు పడటం, అలాగే దశాబ్దం కిందటి టికెట్ల రేట్లకు సంబంధించి జీవోను ఇప్పుడు ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాళ్లు కోర్టులో పోరాడాలని నిర్ణియించుకున్నట్లు తెలిసింది. మరి ఈసారి కోర్టు ఏమంటుంది.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కు బిగ్ షాక్

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>