Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye-pandulo-unde-oshada-gunala-gurinchi-teliste-kachhitanga-tintaru4dc798ae-ba7a-479c-a2d6-980051c9527a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye-pandulo-unde-oshada-gunala-gurinchi-teliste-kachhitanga-tintaru4dc798ae-ba7a-479c-a2d6-980051c9527a-415x250-IndiaHerald.jpg బొప్పాయి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండులో ఉన్నన్ని పోషకాలు ఏ పండు లో లేవని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా బొప్పాయి పండు ఉపయోగపడుతుంది. కొంతమంది బొప్పాయి పండు తింటే వేడి చేస్తుందా అని దూరంగా పెడుతుంటారు. కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవాళ్లు ఖచ్చితంగా తింటారు. బొప్పాయి పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ ఇలా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న బొప్పాయిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంboppaye;vitamin c;hemoglobin;lutein;vitamin;cancer;copper;shakti;coronavirusబొప్పాయి పండులో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే..? కచ్చితంగా తింటారు...బొప్పాయి పండులో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే..? కచ్చితంగా తింటారు...boppaye;vitamin c;hemoglobin;lutein;vitamin;cancer;copper;shakti;coronavirusMon, 12 Apr 2021 02:00:00 GMT బొప్పాయి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండులో ఉన్నన్ని పోషకాలు ఏ పండు లో లేవని పోషక  ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా బొప్పాయి పండు ఉపయోగపడుతుంది. కొంతమంది బొప్పాయి పండు తింటే వేడి చేస్తుందా అని దూరంగా పెడుతుంటారు. కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవాళ్లు ఖచ్చితంగా తింటారు. బొప్పాయి పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ ఇలా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న బొప్పాయిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి,  అలాగే అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది.  వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...

 బొప్పాయి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. కాబట్టి బొప్పాయి పండును రోజు తినడం చాలా మంచిది.

 బొప్పాయి పండును భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా పేగుల్లో, పొట్ట లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడానికి బొప్పాయి సహకరిస్తుంది.

 డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.  ఇలాంటి సమయంలో బొప్పాయి పండు తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

 అధిక బరువు ఉన్నవాళ్లు కూడా బొప్పాయి నిరభ్యంతరంగా తినవచ్చు. ఎందుకంటే బొప్పాయి పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల బరువు కూడా పెరగదు.

 బొప్పాయి పండులో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కంటికి సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.

 బొప్పాయి పండులో విటమిన్ సి  అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెరగడానికి ఏర్పడుతుంది. అంతేకాకుండా దంతాల చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి, రక్తవృద్ధికి కూడా విటమిన్ సి  తోడ్పడుతుంది.

 రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళు హాయ్ పండు తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అంతేకాకుండా బొప్పాయిలో  ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల హర్ష మొలలు రాకుండా కాపాడడమే కాకుండా, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.

 బొప్పాయిలో విటమిన్ బి కూడా ఉంటుంది. ఇది నోటి పూత రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది. అలాగే పెదాల పగుళ్ళను నిర్మూలించడానికి బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది.

 మూత్ర  పిండాల్లో రాళ్ళు ఉన్నవారికి బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో బీటా కెరోటిన్,లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వైరస్ పై పోరాటం చేస్తాయి. అలాగే గర్భాశయ క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో రాజమౌళి సినిమా ఎప్పుడంటే...?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>