MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabd31758e3-aca9-4005-a263-619983f2b841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabd31758e3-aca9-4005-a263-619983f2b841-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పాతిక పై చిలుకు సినిమాలు చేశారు. ఆయన సినీ పరిశ్రమకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అయింది. పవన్ చేసిన సినిమాల్లో హిట్లూ ఫట్లూ బ్లాక్ బస్టర్లూ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే పవన్ ని తెలుగు సినిమా పరిశ్రమ సరిగ్గా ఉపయోగించుకుందా అన్నదే ఇపుడు చర్చ. vakeelsaab;pawan;kalyan;pawan kalyan;vidya;korcha;industries;cinema;tamil;electricity;audience;silver;silver screen;chatrapathi shivaji;nijam;sivaji;partyపవన్ లోని ఆ ఎలిమెంట్ తోనే మ్యాజిక్ ?పవన్ లోని ఆ ఎలిమెంట్ తోనే మ్యాజిక్ ?vakeelsaab;pawan;kalyan;pawan kalyan;vidya;korcha;industries;cinema;tamil;electricity;audience;silver;silver screen;chatrapathi shivaji;nijam;sivaji;partyMon, 12 Apr 2021 19:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పాతిక పై చిలుకు సినిమాలు చేశారు. ఆయన సినీ పరిశ్రమకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అయింది. పవన్ చేసిన సినిమాల్లో హిట్లూ ఫట్లూ బ్లాక్ బస్టర్లూ కూడా ఎన్నో ఉన్నాయి.

అయితే పవన్ ని తెలుగు సినిమా పరిశ్రమ సరిగ్గా ఉపయోగించుకుందా అన్నదే ఇపుడు చర్చ. పవన్ కి సరైన పాత్ర దొరికితే నటనలో ఎలా రెచ్చిపోతాడో వకీల్ సాబ్ మూవీ కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అటువంటి పవన్ చేత డ్యూయెట్లు పాడిస్తూ పంచ్ డైలాగ్స్ తో విలన్లను టార్గెట్ చేస్తూనే ఇప్పటిదాకా మేకర్స్ అనేక రకాలైన విన్యాసాలు చేశారు. నిజంగా ఆర్టిస్ట్ అన్న వాడికి ఇది తీరని అన్యాయమే.

పవన్ కళ్యాణ్ లో మెరిట్స్ చాలా ఉన్నాయి. ఆయన కళ్ళు చాలా పెద్దవి. వాటిలో ఎన్నో భావాలు పలుకుతాయి. ఇక పవన్ లో నిప్పు కణిక లాంటి ఫైర్ ఉంది. దాన్ని ఆయన పాత్రలో చూపిస్తే అది సజీవంగా జనం గుండెల్లో అలాగే ఉండిపోతుంది. మరి ఈ విషయంలో పవన్ కి తగిన కధలు ఇన్నాళ్ళూ రాలేదు అనే చెప్పాలి. మనకు కొన్ని కధలు ఉంటాయి. వాటిని న్యాయం చేయాలంటే నిలువెల్లా ఆవేశం ఉన్న వారే పనికివస్తారు. తమిళంలో శివాజీ గణేషన్ అలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. ఆవేశం తెచ్చుకుంటే వచ్చేది కాదు. సహజంగా ఉంటే మాత్రం అది కచ్చితంగా సినిమా తెర మీద పండుతుంది. అటు చూస్తున్న ఆడియన్స్ లోనూ గగ్గుర్పాటు కలిగిస్తుంది. వకీల్ సాబ్ లోనూ అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి.

కోర్టు సీనులో పవన్ పూర్తి ఆవేశంతో చెబుతున్నా డైలాగ్స్ ని చూస్తే ఆడియన్ కూడా సీట్లో కూర్చుని ఉండలేదు. అతని మనసు కూడా అగ్గిరవ్వలా మండిపోతుంది. అలాంటి భావోద్వేగాన్ని కొందరు నటులు మాత్రమే అలా వెండి తెర నుంచి ఎదురుగా ఉన్న ఆడియన్స్ లోకి విద్యుత్ తరంగంలా పంపించగలరు. పవన్ విషయం తీసుకుంటే ఆ ఎలిమెంటే ఆయనకు ఉన్న అసలైన బలం. పవన్ సరైన సమయానికి ఎంచుకున్న పాత్ర ఇది. ఇపుడు ఆయన బాధ్యాతాయుతమైన పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన ఈ స్టేజ్ లో వేయాల్సిన పాత్రలు కూడా ఇవే. అందువల్ల పవన్ ఎలిమెంట్ ని పట్టుకుని మ్యాజిక్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉంటే వెండి తెర మీద మరిన్ని వకీల్ సాబ్ లాంటి మూవీస్ రావడం తధ్యమని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ హిట్ నివేదకి ఉపయోగ పడలేదా?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>