PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-madasu-gangadharam-janasena-bjp-tirupati-bypoll601312fd-6a10-4675-8f11-e9e7f3331c14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-madasu-gangadharam-janasena-bjp-tirupati-bypoll601312fd-6a10-4675-8f11-e9e7f3331c14-415x250-IndiaHerald.jpgజనసేన కీలక నేత రాజీనామా, అయోమయంలో పార్టీ.. అనుకునేంతగా మాదాసు గంగాధరం రాజీనామాపై విస్తృత ప్రచారం జరిగింది. అసలు నిజంగానే మాదాసు గంగాధరం లేకపోతే జనసేన పార్టీకి అంత నష్టం జరుగుతుందా? ఎప్పుడో పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఆయన, ఇప్పుడు రాజీనామా లెటర్ రాయడం ఏంటి? అసలీ లేఖతోఆయన ఏం సాధించాలనుకున్నారు? ఇంత తీరిగ్గా రాజీనామా చేయడానికి కారణాలేంటి? అనే చర్చ ఇప్పుడు తిరిగి మొదలైంది. pawan kalyan, madasu gangadharam, janasena, bjp, tirupati bypoll;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;nadendla manohar;janasena;2019;రాజీనామా;tirupati;husband;letter;janasena party;nijam;partyఉప ఎన్నికల వేళ.. మాదాసుని తెరపైకి తెచ్చిందెవరు..?ఉప ఎన్నికల వేళ.. మాదాసుని తెరపైకి తెచ్చిందెవరు..?pawan kalyan, madasu gangadharam, janasena, bjp, tirupati bypoll;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;nadendla manohar;janasena;2019;రాజీనామా;tirupati;husband;letter;janasena party;nijam;partyMon, 12 Apr 2021 08:00:00 GMTజనసేన కీలక నేత రాజీనామా, అయోమయంలో పార్టీ.. అనుకునేంతగా మాదాసు గంగాధరం రాజీనామాపై విస్తృత ప్రచారం జరిగింది. అసలు నిజంగానే మాదాసు గంగాధరం లేకపోతే జనసేన పార్టీకి అంత నష్టం జరుగుతుందా? ఎప్పుడో పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఆయన, ఇప్పుడు రాజీనామా లెటర్ రాయడం ఏంటి? అసలీ లేఖతోఆయన ఏం సాధించాలనుకున్నారు? ఇంత తీరిగ్గా రాజీనామా చేయడానికి కారణాలేంటి? అనే చర్చ ఇప్పుడు తిరిగి మొదలైంది.

వాస్తవానికి మాదాసు గంగాధరాన్ని కేవలం సీనియర్ నాయకుడని, గతంలో తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతోటే ఆయన్ను పిలిచి పార్టీలో సముచిత స్థానం కల్పించారు పవన్ కల్యాణ్. గతంలో జనసేన కార్యక్రమాలు ఎక్కడ ఏవి జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. 2019 ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కూడా ఆయన హవా నడిచిందనేది వాస్తవం. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. జనసేనతో కలసి ప్రయాణం చేస్తే ఉపయోగం లేదనుకుని సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ ఆఫీస్ కి రావడం ఆపేశారు, జనసేనతో బంధాలు తెంచుకున్నారు. కొత్తగా వేరే పార్టీలో చేరాలన్నా ఆయనకు సాధ్యం కాలేదు. అందుకే ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు.

సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికల వేళ మాదాసు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేయడంతో పార్టీకి నష్టం జరుగుతుందని, కీలక నేత వెళ్లిపోయారనే ప్రచారం మొదలైంది. అయితే వైసీప నేతలే ఆయనతో ఈ పని చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికల వేళ జనసేన నుంచి కీలక నేత వెళ్లిపోయారనే ప్రచారం కోసమే ఈ పని చేయించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్న మాదాసు గంగాధరాన్ని పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోవడంలేదు. ఈ దశలో ఆయన రాజీనామా కేవలం హడావిడి కోసమే నని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ, కాస్తో కూస్తో జనసేనలో కలవరం రేపేందుకే ఆయన అదను చూసుకుని రాజీనామా లేఖ పంపించారని తెలుస్తోంది.

ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టిన జనసేన.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపుకోసం కృషిచేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే సభలను విజయవంతం చేయాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్. మీటింగ్ కి పవన్ కల్యాణ్ రాలేకపోయినా.. కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కు బిగ్ షాక్

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>