PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/niranjan-reddy9846c73f-f429-489f-adc8-9f565e238761-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/niranjan-reddy9846c73f-f429-489f-adc8-9f565e238761-415x250-IndiaHerald.jpgరాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో మంత్రి టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.niranjan reddy;kumaar;srinivas;telangana;court;minister;reddy;coronavirus;panjaaతెలంగాణ మంత్రికి కరోనాతెలంగాణ మంత్రికి కరోనాniranjan reddy;kumaar;srinivas;telangana;court;minister;reddy;coronavirus;panjaaMon, 12 Apr 2021 14:48:38 GMTతెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఎవరీని వదలడం లేదు వైరస్. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు కరోనా సోకింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి వైరస్ నిర్దారణ అయింది. తాజాగా ఓ మంత్రికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.  గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో మంత్రి టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 2,251 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ వల్ల ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,29,529కి చేరుకుంది. కరోనాతో మొత్తం 1,765 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,05,900 మంది రికవరీ అయినట్లు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసినహెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు స్పందించారు. తెలంగాణలో 4 లక్షల 64 వేల డోసుల స్టాక్ ఉందన్నారు. సోమవారం  రాత్రికి తెలంగాణాకు 3 లక్షల 62 వేల డోసులు రానున్నాయి. మరో ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 22 లక్షల 14, 270 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు  తెలిపారు.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు.  శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది. సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకడంతో సుప్రీంకోర్టులో కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ వివాదంపై స్పంద‌న ఏదీ..?

వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>