PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election310f0beb-9d8b-4866-b245-6b893117933f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election310f0beb-9d8b-4866-b245-6b893117933f-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు సీఎం జగన్‌పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని.. రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. వెంకన్న ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. tirupati by election;ntr;allu aravind;ramu;tiru;vishnu;jagan;telugu;police;tirupati;sri venkateswara swamy;university;cancer;culture;husband;tdp;lung cancer;pulivendula;ycp;international;nandamuri taraka rama rao;father;tirumala tirupathi devasthanamజగన్ కు చంద్రబాబు వార్నింగ్జగన్ కు చంద్రబాబు వార్నింగ్tirupati by election;ntr;allu aravind;ramu;tiru;vishnu;jagan;telugu;police;tirupati;sri venkateswara swamy;university;cancer;culture;husband;tdp;lung cancer;pulivendula;ycp;international;nandamuri taraka rama rao;father;tirumala tirupathi devasthanamMon, 12 Apr 2021 20:23:57 GMTతిరుపతి ఉపఎన్నిక ఏపీలో రాజకీయ వేడి పెంచుతోంది. ఎన్నికల ప్రచారంలో మాటల తీవ్రత పెంచుతున్నారు నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలో రోడ్ షో నిర్వహించిన  చంద్రబాబు సీఎం జగన్‌పై  ఓ రేంజ్ లో  విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని.. రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. వెంకన్న ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

‘‘తిరుపతిని ఏడు నుంచి 5 కొండలు చేస్తామని వైఎస్‌ అన్నాడు. పింక్‌ డైమండ్‌ మా ఇంట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అసలు పింక్‌ డైమండే లేదంటున్నారు. రమణదీక్షితులు.. జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడమేంటి?. రాముడి తల తీసిన వాళ్లను పట్టుకోకుండా నిలదీసిన మాపై కేసులా?. ఖబడ్దార్‌ జగన్‌రెడ్డి.. మరో దేవాలయంపై దాడి జరిగితే అంతుచూస్తాం. ఓట్ల కోసం ఇంటింటికి తిరుమల లడ్డూని పంచారు. లడ్డూలు పంచుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు?. వెంకటేశ్వరస్వామి మాత్రం మిమ్మల్ని వదలరు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

‘‘ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రానికి ఏం చేసింది?. ఒక్క అవకాశం అంటూ ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా తేవడంలో టీడీపీ విఫలమైందన్నారు. నేను పోటుగాడిని హోదా తీసుకొస్తానని జగన్‌ అన్నాడు. పోలీసులను పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. నామినేషన్‌ వేసిన వాళ్లని బెదిరిస్తారా?. ఈ రాష్ట్రం మీ తాత జాగీరా.. మీ నాన్న సొత్తా?. నేను తలుచుకుని ఉంటే జగన్‌ అడుగు బయటపెట్టేవాడా?. పులివెందుల సంస్కృతి రాష్ట్రంలో తేవాలనుకుంటున్నారా?. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఇది పులివెందుల కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుర్తుపెట్టుకో.’’ అని చంద్రబాబు అన్నారు.

 ‘‘ఇది రాష్ట్రాన్ని కాపాడుకునే ఎన్నికలు. అందుకు మీ చేతిలో ఉన్న ఓటు వజ్రాయుధాన్ని వినియోగించండి. తిరుపతిలో ఎన్టీఆర్ మహిళా యూనివర్సిటీ, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఐసెర్, ఐఐఐటీ, తెలుగుగంగ, జూ పార్క్, అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా కాన్సర్ ఆసుపత్రి , గరుడ వారధి, అంతర్జాతీయ విమానాశ్రయం, చాలా కంపెనీలు ఇలా అన్ని టీడీపీ ఏర్పాటు చేసింది. వైసీపీ ఒక తట్టమట్టి అయినా వేసిందా?.’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ హిట్ నివేదకి ఉపయోగ పడలేదా?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>