HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetis-ladies-fingers-c11124a6-aea0-4290-962d-4e7e3052b192-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetis-ladies-fingers-c11124a6-aea0-4290-962d-4e7e3052b192-415x250-IndiaHerald.jpgడయాబెటిస్.. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య. ఇది దీర్ఘకాలిక మరియు వేగంగా పెరుగుతున్న ప్రాణాంతక సమస్య అని కూడా చెప్పవచ్చు.. ఇక డయాబెటిస్ వచ్చిన తర్వాత మొదట్లో దీని లక్షణాలు పెద్దగా తెలియవు. పోను పోను శరీర అవయవాలను పూర్తిగా నాశనం చేస్తుంది.. ఈ డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం లో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక చిన్న ప్రశ్న అందరినీ ఇబ్బందికి గురి చేస్తోంది.. అదేమిటంటే డయాబెటిస్ ఉన్నవారు బెండకాయలు తినవచ్చా..?లేదా.?అని.. అయితే ఈ ప్రశ్నDAYABETIS LADIES FINGERS;sugar;cholesterolబెండకాయలు తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందా..?బెండకాయలు తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందా..?DAYABETIS LADIES FINGERS;sugar;cholesterolMon, 12 Apr 2021 14:40:00 GMT
డయాబెటిస్.. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య. ఇది దీర్ఘకాలిక మరియు వేగంగా పెరుగుతున్న ప్రాణాంతక సమస్య అని కూడా చెప్పవచ్చు.. ఇక డయాబెటిస్ వచ్చిన తర్వాత మొదట్లో దీని లక్షణాలు పెద్దగా తెలియవు. పోను పోను శరీర అవయవాలను పూర్తిగా నాశనం చేస్తుంది.. ఈ డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం లో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక చిన్న ప్రశ్న అందరినీ ఇబ్బందికి గురి చేస్తోంది.. అదేమిటంటే డయాబెటిస్ ఉన్నవారు బెండకాయలు తినవచ్చా..?లేదా.?అని.. అయితే  ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఇప్పుడు ఇక్కడ నివృత్తి చేసుకుందాం..

యాంటీ డయాబెటిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు కలిగి ఉన్న ఉత్తమమైన ఆహారాలలో బెండకాయ కూడా ఒకటి. ఇది శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బెండకాయలలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించే యాంటీ హైపెర్లిపిడెమిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందుకే బెండకాయలు తిన్నప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ అలాగే లిపిడ్ తగ్గుతుంది. అందుకే తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్న ఆహారాన్ని డయాబెటిక్ డైట్ లో చేర్చుకొని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బెండకాయ 20  గ్లైసెమిక్ సూచిక ను కలిగి ఉంటుంది. అంటే బెండకాయ వినియోగంలో గ్లూకోస్ స్థాయిని చాలా నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి అవి గౌట్ లో విచ్చిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది..

అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బెండకాయ వంటకాల పై సులభంగా స్నాక్స్ చేసుకోవచ్చు. అలాగే వారి కడుపును కూడా నింపవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చు.. అంతే కాకుండా మూత్రపిండాల వ్యాధికి కూడా డయాబెటిస్ ప్రధాన ప్రమాద కారకం . అధిక చక్కెర మూత్రపిండాల నరాలను కూడా దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా రావడం మొదలు పెడతాయి. అందుకే బెండకాయలు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. తరచూ బెండకాయలు ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల మూత్రపిండాలకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది.. కాబట్టి నిరభ్యంతరంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల బెండకాయలు తినవచ్చు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హంసలాంటి హన్సిక కు ఛాన్సులు రావట్లేదేంటి..ఏమై ఉంటుంది..!!

వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>