MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi88d5a158-2287-4484-a084-d66b94f1d0b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi88d5a158-2287-4484-a084-d66b94f1d0b1-415x250-IndiaHerald.jpgఉగాది పండుగకు ముందు రోజు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడీ టీజర్ విడుదలయింది. ఒక్క నిమిషంలో 20 సెకన్ల పాటు కొనసాగిన ఈ టీజర్ లో చాలా హింట్స్ కనిపించాయి. ఈ టీజర్ మొత్తంలో ఎన్నో యాక్షన్ సన్నివేశాలు కనిపించాయి కానీ కేవలం ఒకే ఒక్క డైలాగ్ వినిపించింది. అయితే ఈ యాక్షన్ ప్యాకెడ్ టీజర్ ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచేందుకు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో లో ఎంత కృషి చేశారో అర్థం అవుతుంది. టీజర్ లో కనిపించిన సన్నివేశాల గురించి చర్చిస్తే.. ఓపెనింగ్ సీన్ లో ఓ హార్బర్‌ను కనిపిస్తుంది.. అలానే khiladi;ravi;meenakshi;mukesh;ram gopal varma;devi sri prasad;prasad;ramesh varma;ravi teja;tara;vennela;vennela kishore;korcha;cinema;tamil;hero;khaidi.;heroine;khaidi new;mass;katthi;paruguఖిలాడీ టీజర్: రవితేజ కెరీర్ లో మరో యాక్షన్ ప్యాకెడ్ మూవీ..ఖిలాడీ టీజర్: రవితేజ కెరీర్ లో మరో యాక్షన్ ప్యాకెడ్ మూవీ..khiladi;ravi;meenakshi;mukesh;ram gopal varma;devi sri prasad;prasad;ramesh varma;ravi teja;tara;vennela;vennela kishore;korcha;cinema;tamil;hero;khaidi.;heroine;khaidi new;mass;katthi;paruguMon, 12 Apr 2021 11:26:30 GMTమాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడీ టీజర్ విడుదలయింది. ఒక్క నిమిషంలో 20 సెకన్ల పాటు కొనసాగిన ఈ టీజర్ లో చాలా హింట్స్ కనిపించాయి. ఈ టీజర్ మొత్తంలో ఎన్నో యాక్షన్ సన్నివేశాలు కనిపించాయి కానీ కేవలం ఒకే ఒక్క డైలాగ్ వినిపించింది. అయితే ఈ యాక్షన్ ప్యాకెడ్ టీజర్ ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచేందుకు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో లో ఎంత కృషి చేశారో అర్థం అవుతుంది.

" style="height: 332px;">


టీజర్ లో కనిపించిన సన్నివేశాల గురించి చర్చిస్తే.. ఓపెనింగ్ సీన్ లో ఓ హార్బర్‌ను కనిపిస్తుంది.. అలానే రవితేజ జైలులో అటువైపు తిరిగి కూర్చుని ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నట్టు కనిపించింది. ఆ తర్వాత నవ్వుతూ డింపుల్ హయతి కనిపిస్తారు. పెద్ద లారీ కంటెయినర్లలో ఏదో అక్రమంగా సరఫరా అవుతున్నట్టు దృశ్యాలు కనిపించాయి. రవితేజ కత్తి పట్టుకుని రౌడీలను చంపడం.. కొందరు దుండగులు ఒక బాలిక వెంటపడడం.. ఆ బాలికను కాపాడేందుకు రవితేజ ఉరుకులు పరుగులు పెట్టడం.. ఆ తర్వాత సీన్ లో సూట్ బూటు లో కళ్లద్దాలతో స్టైలిష్ గా కనిపించడం వంటివి ఆసక్తికరంగా అనిపించాయి. జైల్ లో ఇతర ఖైదీలతో పోట్లాడటం చూస్తుంటే దిమ్మతిరిగే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అర్థమవుతోంది.



ఇంకా వివరంగా టీజర్ ని పరిశీలిస్తే.. రవితేజ హీరో పెద్ద వ్యాపారం చేస్తున్నట్టు.. ఆయనకు ముఖేష్ రుషి వంటి విలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ నటుడు ఆడిషన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రవితేజ హీరోయిన్ డింపుల్ హయతి మెడకు తాడు బిగించి ఆమెను చంపేస్తున్నట్టు ఈ టీజర్ కనిపించింది. ఈ విధంగా చూసుకుంటే ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. టీజర్ చివర్ లో రవితేజ "పిచ్చి భావోద్వేగాలను వీడి తెలివిగా ఆటలాడితే.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు," అని ఒక పవర్ ఫుల్ డైలాగ్ వదులుతారు. దీన్నిబట్టి రవితేజ ఒక క్రూరమైన పాత్రలో నటించబోతున్నారని అర్థమవుతోంది.




ఇకపోతే రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఖిలాడీ సినిమా లో మీనాక్షి చౌదురి హీరోయిన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, అనసూయలతో పాటు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్‌లో లైంగిక వేధింపులు

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>