PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/volunteers-village-secretariats-cm-jagan-ys-jagan-407c4b51-51b3-4fcb-85e8-4e18af78be5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/volunteers-village-secretariats-cm-jagan-ys-jagan-407c4b51-51b3-4fcb-85e8-4e18af78be5c-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభం అవుతోంది. గతంలో వాలంటీర్లు జీతాల పెంపుకోసం నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ వారికి బహిరంగ లేఖ రాస్తూ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారని, పారితోషికంతో దాన్ని ముడిపెట్టొద్దని సూచించారు. అదే సమయంలో వారికి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటినుంచి వాలంటీర్లకు సత్కారం, అవార్డుల కార్యక్రమం మొదలవుతోంది. volunteers, village secretariats, cm jagan, ys jagan,;tiru;bharatiya janata party;jagan;tirupati;loksabha;assembly;husband;letter;service;tdp;local languageవాలంటీర్లకు సత్కారాలు.. భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..వాలంటీర్లకు సత్కారాలు.. భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..volunteers, village secretariats, cm jagan, ys jagan,;tiru;bharatiya janata party;jagan;tirupati;loksabha;assembly;husband;letter;service;tdp;local languageMon, 12 Apr 2021 09:00:00 GMTరాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభం అవుతోంది. గతంలో వాలంటీర్లు జీతాల పెంపుకోసం నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ వారికి బహిరంగ లేఖ రాస్తూ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారని, పారితోషికంతో దాన్ని ముడిపెట్టొద్దని సూచించారు. అదే సమయంలో వారికి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటినుంచి వాలంటీర్లకు సత్కారం, అవార్డుల కార్యక్రమం మొదలవుతోంది.

ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున అన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లను పురస్కారాలతో సత్కరిస్తారు. వాలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో మూడు కేటగిరీలుగా విభజించారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వాలంటీర్లకు బహూకరిస్తారు.

తొలిరోజు 11 జిల్లాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాలంటీర్ల సన్మానం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతి లోక్‌ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ ముగిసిపోయిన తర్వాత మే 4న ప్రోత్సాహకాల పంపిణీ ఉంటుందని చెబుతున్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..
ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థతో స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం భారీగా లబ్ధి పొందిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థను రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారని టీడీపీ, బీజేపీ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అవార్డుల ప్రదానోత్సవానికి ప్రభుత్వం సిద్ధపడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలను మినహాయించి.. అక్కడి వాలంటీర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు ప్రతిపక్ష నేతలు. ఉప ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసిన వారికే అవార్డులు వస్తాయని ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కొన్ని చోట్ల జగన్ తిరుపతి ఓటర్లకు రాసిన లేఖలను వాలంటీర్లు పంచి పెడుతున్నారంటూ సాక్ష్యాధారాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

16 ఏళ్ల త‌ర్వాత పోటీ ప‌డుతోన్న ర‌జ‌నీ - క‌మ‌ల్‌... విన్న‌ర్ ఎవ‌రో ?

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>