SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021f7c78f20-70e2-4982-a1f9-8a1d4f0317ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021f7c78f20-70e2-4982-a1f9-8a1d4f0317ef-415x250-IndiaHerald.jpg హైదరబాద్ సన్ రైజర్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ మద్య జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ 10 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా 56 బంతుల్లో 80 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి 29 బంతుల్లో 53 పరుగులు ( 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోర్ నమోదు అయ్యింది. రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు.ipl 2021;rana;karthik;chakravarthy;krishna;letter;paruguఐపీఎల్ 2021 : తొలి మ్యాచ్ లో పొరాడి ఓడిన సన్ రైజర్స్..!!ఐపీఎల్ 2021 : తొలి మ్యాచ్ లో పొరాడి ఓడిన సన్ రైజర్స్..!!ipl 2021;rana;karthik;chakravarthy;krishna;letter;paruguMon, 12 Apr 2021 07:21:02 GMT హైదరబాద్ సన్ రైజర్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ మద్య జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ 10 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా 56 బంతుల్లో 80 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి 29 బంతుల్లో 53 పరుగులు ( 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోర్ నమోదు అయ్యింది. రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు.

 అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి పరాజయం పాలైంది. ముఖ్యంగా సన్ రైజర్స్ కు ఓపెనర్స్ నుండి శుభారంభం లభించలేదు. డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో దినేష్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత  షకిబ్‌ అల్‌ హసన్‌ వేసిన మూడో ఓవర్‌‌లో తొలి బంతికి సాహా (7 పరుగులు ) అవుట్ కావడంతో..  హైదరాబాద్‌ 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

తర్వాత మనీశ్‌, బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళారు. అవకాశం దోరినప్పుడల్లా బెయిర్‌స్టో బౌండరీలు బాదుతూ వచ్చాడు.వరుణ్‌ చక్రవర్తి వేసిన 12 ఓవర్‌లో తొలి బంతిని బెయిర్‌ స్టో(54) సిక్సర్‌గా మలిచి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. బెయిర్ స్టో ధాటిగా అదే క్రమం లో కమిన్స్ బౌలింగ్ లో వేడుదిరిగాడు. ఇక మనిష్ పాండే కూడా (44 బంతుల్లో 61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తనదైన రీతిలో దూకుడు ప్రదర్శించినప్పటికి రన్ రేట్ పెరిగిపోవడంతో హైదరబాద్ కు ఓటమి తప్పలేదు. అన్నీ విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన కోల్ కతా కు ఈ సీజన్ లో శుభారంభం లభించింది . 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌మౌళి - మ‌హేష్ క‌థ ఇదే ?

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>